ExtraMarital Buried Alive| వివాహేతర సంబంధాలు కొన్నిసార్లు విడాకులతో అంతమైతే.. మరి కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ ఈ రెండో కోవకి చెందింది. ఓ యువకుడు తన ఇంటి యజమాని భార్యపై మనసు పారేసుకున్నాడు. అతను దేహదారఢ్యం, అందగాడు కావడంతో ఆమె కూడా అతడిని కామించింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత వారి మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం గురించి ఆ ఇంటి యజమానికి తెలిసింది. అయితే ఆ ఇంటి యజమాని తన కోపాన్ని, తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ప్రవర్తించాడు. కానీ లోలోపల అతడిలో ప్రతీకారం అనే భావన కట్టలు తెచ్చుకుంటూ ఉంది. అందుకే పగ తీర్చుకోవడానికి తన కోపాన్ని కూల్ గా ఓ ఆయుధంగా మార్చుకున్నాడు. భార్యను చంపుదామనుకున్నాడు. కానీ తన కాపురం ఎందుకు కూల్చాలి? అని భావించి తన భార్య ప్రియుడినే హత్యకు భారీ స్కెచ్ వేశాడు. అతడిని హింసించి హింసించి చంపాలని నిర్ణయించుకున్నాడు. నెలల తరబడి ప్లాన్ చేసి అతడిని కిడ్నాప్ చేశాడు. కొన్ని రోజుల పాటు బంధించి కాళ్లు, చేతులు విరగొట్టాడు. ఆ తరువాత ఓ సంచిలో కట్టేసి సజీవంగా పూడ్చి పెట్టాడు. ఈ ఘటన హర్యాణాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే. హర్యాణా రాష్ట్రం రోహ్‌తక్ నగరంలో నివసించే హర్దీప్ సింగ్ (45) కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారిది సొంతిల్లు. అయితే ఏడాది క్రితం వారింట్లో ఓ పై భాగంలో అద్దెకు నివసించడానికి జగ్దీప్(28) అనే యువకుడు వచ్చాడు. రోహ్‌తక్ నగరంలోని బాబా మస్త్‌నాథ్ యూరివర్సిటీలో జగ్దీప్ యోగా టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జగ్దీప్ అందగాడు, బాడీ బిల్డర్, పైగా యోగా టీచర్.. దీంతో అతనిపై హర్దీప్ సింగ్ భార్య మనుసుపడింది. జగ్దీప్ కూడా ఒంటరిగా ఉండడంతో అతను ఇంట్లో ఉన్న సమయంలో తరుచూ ఆమెతో మాట్లాడేవాడు. కొన్ని రోజులకే ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా ఏకమయ్యారు. ఎవరికీ తమ సంబంధం గురించి తెలియదని వీరు యధేచ్ఛగా తమ ప్రేమను కొనసాగించారు.
Also Read: మార్నింగ్ ప్రియురాలు.. నైట్ మరొకరితో, యూపీలో ఓ యువకుడి స్టోరీ
హర్దీప్ బిజినెస్ పని మీద తరుచూ ఢిల్లీ, చండీగడ్ కు వెళ్లేవాడు. అయితే హర్దీప్ స్నేహితుడు ధరంపాల్‌కు అనుకోకుండా తన స్నేహితుడి భార్య అక్రమ సంబంధం గురించి తెలిసింది. అది కాస్త అతను హర్దీప్ సింగ్‌కు చేరవేశాడు. ఇది తెలిసిన హర్దీప్ సింగ్ నిజమేంటో తెలుసుకోవడానికి నగరంలోనే ఉంటూ తాను ఢిల్లీ వెళుతున్నానని చెప్పాడు. భర్త లేడు కదా అని అతని భార్య జగ్దీప్ తో ఓపెన్ గా సినిమాకు, షికార్లకు వెళ్లింది. ఆ తరువాత ఇంట్లో వారు ఏం చేశారో అంతా హర్దీప్ తెలసుకొని తట్టుకోలేకపోయాడు. తన భార్య తనను మోసం చేసిందని తెలిసి మానసికంగా కుంగిపోయాడు. ఆమెను చంపేదామనుకున్నాడు. కానీ పిల్లలు ఉండడంతో హాయిగా ఉన్న తన కాపురం నాశనమవుతుందని భావించి తన పగ చల్లార్చుకోవడం కోసం ఆమె ప్రియుడైన జగ్దీప్ ని చంపాలనుకున్నాడు. అందుకోసం బాగా ఆలోచించి ప్లాన్ వేశాడు.
సమీపంలోని ఒక గ్రామం దాద్రీ చక్రిలో తన సొంత భూమిలో 7 అడుగుల గుంతను తవ్వించాడు. బోర్ వెల్ వేయిస్తున్నానని అందరినీ నమ్మించాడు. ఆ తరువాత డిసెంబర్ 2024లో ఒకరోజు జగ్దీప్ యూనివర్సిటీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో అతనిపై తన స్నేహితుడు ధరంపాల్ తో కలిసి దాడి చేశాడు. అతడిని కిడ్నాప్ చేసి తన స్వగ్రామానికి కారులో తీసుకెళ్లాడు. అక్కడ జగ్దీప్ కాళ్లు, చేతులు విరగ్గొట్టి.. కొన్ని రోజుల పాటు అలాగే ఒక గదిలో బంధించాడు. ఆ తరువాత కొనఊపిరితో ఉన్న జగ్దీప్ ను ఆ ఏడు అడుగుల గుంతలో పాతిపెట్టాడు.
రెండు వారాల తరువాత జగ్దీప్ తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని, ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోందని ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ ప్రారంభించాక.. జగ్దీప కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. అతను ఎక్కువగా తన ఇంటి యజమాని హర్దీప్ భార్యతో మాట్లాడినట్లు తెలిసింది. అంతే హర్దీప్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో వారికి ఆమె, ఆమె భర్త హర్దీప్ పై అనుమానం కలిగింది. హర్దీప్ ను పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా షాకింగ్ విషయం తెలిసింది. డిసెంబర్ లోనే జగ్దీప్ ను హతమార్చానని అతను అంగీకరించాడు. పోలీసులు ఈ హత్యలో హర్దీప్ కు సాయం చేసిన అతని స్నేహితుడు ధరంపాల్ ను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది.