BigTV English

Uttar Pradesh News: మార్నింగ్ ప్రియురాలితో పెళ్లి.. నైట్ మరొకరితో ఇంకో పెళ్లి.. వీడు చాలా కంత్రీగాడు

Uttar Pradesh News: మార్నింగ్ ప్రియురాలితో పెళ్లి.. నైట్ మరొకరితో ఇంకో పెళ్లి.. వీడు చాలా కంత్రీగాడు

Uttar Pradesh News: దేశంలోని అమ్మాయి దొరక్క పెళ్లికాని ప్రసాద్‌లు పెరుగుతున్నారు. చాలా కమ్యూనిటీల్లో ఇదే సమస్య వెంటాడుతోంది. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరుకుంటున్నారు యువకులు. ఈ సమస్య ఆ విధంగా తయారైంది. కానీ తనకు అలాంటిదేమీ లేదంటున్నాడు యూపీకి చెందిన ఓ యువకుడు. ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లోకి వచ్చేశాడు.


స్టోరీలో ఏం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు మ్యారేజ్‌లు చేసుకున్నాడు. ఉదయం ప్రియురాలి మెడలో తాళికట్టేశాడు. అదే రోజు రాత్రికి పెద్దలు కుదిర్చిన యువతితో ఏడడుగులు నడిచాడు. చివరకు ఈ వ్యవహారం ప్రియురాలి తెలిసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో కొత్త పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


గోరఖ్‌పూర్‌ జిల్లా హర్పూర్‌ బుధాట్‌ ప్రాంతంలో ఈ తతంగం జరిగింది. 25 ఏళ్ల యువకుడు ఓ యువతితో నాలుగేళ్లుగా లవ్‌లో ఉన్నాడు. ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడం, ఆపై రెండుసార్లు అబార్షన్‌ చేయించాడు. తొలుత దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చింది. డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు.. బిడ్డను నర్సుకు అప్పగించేశాడు.

రెండుసార్లు అబార్షన్

ప్రేమికుడు వ్యవహార శైలి గమనించిన ఆ యువతి క్రమంగా ఒత్తిడి తెచ్చింది. తమ పెళ్లిని అందరూ అంగీకరించాల్సిందేనని, జీవితాంతం కలిసి ఉండాలని పట్టుబట్టింది. చివరకు ప్రియురాలి కోరిక మేరకు రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మించాడు. అందుకు ప్రియురాలు సరేనని తల ఊపింది.

ALSO READ: ఎంఎంటీఎస్ రేప్ నిందితుడు ఇతడే, కీలక నిజాలు వెల్లడి

ఈ క్రమంలో రెండురోజుల కిందట రిజిస్టర్‌ ఆఫీసుకు తీసుకెళ్లి ప్రియురాల మెడలో తాళి కట్టాడు.. ఆపై దండలు మార్చకున్నారు. తన ప్రియుడు చాలా గొప్పోడని, నమ్మిన మాట ప్రకారం చేశాడని మురిసిపోయింది. రాత్రికి జరగాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పెద్దలు కుదుర్చిన పెళ్లి

అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. రాత్రి గడుస్తున్నా, తన భర్త రాలేదని ఎదురుచూసిన ప్రియురాలికి అసలు విషయం తెలిసి షాకైంది. ఏం చెయ్యాలో తెలియక కాసేపు సైలెంట్ అయిపోయింది.   తేరుకున్న తర్వాత ప్రియురాలు, భర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ఇష్టానుసారంగా దూషించింది. వెంటనే ఆమెని అక్కడిని వెళ్లగొట్టారు. కొత్త పెళ్లిని దూషించవాళ్లు లేకపోలేదు.

కోపంతో రగిలిపోయిన ప్రియురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి నుంచి  ఫిర్యాదు అందిందని, ఆమె చేసిన ఆరోపణలు నిజం ఉందని తేలిందన్నారు. ఒకటి చట్ట బద్దంగా చేసుకున్న వివాహం కాగా, మరొకటి అగ్నిసాక్షిగా కట్టిన తాళి కట్టిన పెళ్లి. ఈ రెండింటికి పోలీసులు ఏ విధంగా ముగింపు ఇస్తారోనన్నది అసలు ప్రశ్న.

ALSO READ: ఐపీఎల్ బెట్టింగ్.. పట్టాలపై విగత జీవిగా యువకుడు

Related News

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Big Stories

×