E-Paper
Advertisement

హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయిన మనవడు.. థార్ కారు కింద నలిగిపోయి అమ్మమ్మ మృతి.

హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయిన మనవడు.. థార్ కారు కింద నలిగిపోయి అమ్మమ్మ మృతి.
Advertisement

Farrukhabad Parking Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఒక సాధారణ పార్కింగ్ పొరపాటు ఘోర విషాదానికి దారితీసింది. ఇంటి లోపల కారును పార్క్ చేస్తుండ‌గా, హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోవడంతో 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. తన మనవడు నడుపుతున్న మహీంద్రా థార్ కారు వెనక్కి దూసుకురావడంతో ఆ మహిళ గోడకు, కారుకు మధ్య నలిగిపోయి మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గ‌త‌ గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో మృతురాలిని సర్ళా కటియార్ (70) గా గుర్తించారు. ఆమె గతంలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. మనవడు తన థార్ కారును ఇంటి లోపలికి తీసుకువస్తుండగా, సర్ళా కటియార్ గేటు తెరిచారు. కారు లోపలికి వెళ్లిన తర్వాత ఆమె గేటుకు ఉన్న రెండు వైపుల తలుపులను మూసి తాళం వేయడానికి ప్రయత్నించారు. అయితే, లోపల కారు పార్క్ చేసిన మనవడు హ్యాండ్‌బ్రేక్ వేయకుండానే కిందకు దిగడంతో, కారు ఒక్కసారిగా వెనక్కి (Reverse) వేగంగా దూసుకువచ్చింది.

Advertisement

గేటు వద్ద నిలబడి ఉన్న కటియార్‌ను ఆ కారు బలంగా వెనక్కి నెట్టింది. ఇంటి వెనుక ఉన్న గోడకు, కారు వెనుక భాగానికి మధ్య ఆమె చిక్కుకుపోయారు. కారు పదేపదే గోడను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కేకలు విన్న మనవడు వెంటనే కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారు డోర్ తీయడానికి ప్రయత్నించి, ఆపై కారు తాళాల కోసం ఇంట్లోకి పరుగెత్తాడు. తీవ్ర గాయాలైన సర్ళాను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఫతేగఢ్ పోలీసులు ఈ ఘటనపై ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. మనవడు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోవడంతో, ఏటవాలుగా ఉన్న ప్రదేశం నుండి వాహనం వెనక్కి దొర్లిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అయితే, ఈ ఘటనపై కుటుంబ సభ్యుల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సర్ళా కటియార్ కుమారుడు ఫరూఖాబాద్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. ఒక చిన్న అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×