Road Accident: బ్రిటన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదంలో మృతిచెందారు. గణపతి నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మృతిచెందిన ఇద్దరిని నాదర్ గుల్ కు చెందిన చైతన్య (23), బోడప్పల్ కు చెందిన రిషితేజ (21) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.చైతన్య ఇటీవలే బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం బ్రిటన్ కి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ రిషితేజ, మరి కొంతమందితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఈ ఘోర రోడ్డ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ రావుల, నూతన్ తాటికాయలలు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరు హైదరాబాద్ కు చెందిన విద్యార్థుల మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా కుటుంబ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ALSO READ: Paramedical Staff Jobs: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 5 రోజులే గడువు