OTT Movie : మార్వెల్ కామిక్స్ నుంచి వచ్చిన ఒక సూపర్ హీరో సినిమా ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా యాక్షన్ సీన్స్ తో చిన్నపిల్లల చేత కేరింతలు కొట్టిస్తోంది. ఈ సినిమా $200 మిలియన్ బడ్జెట్‌తో, బాక్సాఫీస్ వద్ద దాదాపు $ 400 మిలియన్ లు వసూలు చేసింది. మరి ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఎందులో ఉందంటే
‘థండర్ బోల్ట్స్’ (Thunderbolts) 2025లో విడుదలైన అమెరికన్ సూపర్ హీరో చిత్రం. మార్వెల్ కామిక్స్‌లోని థండర్‌బోల్ట్స్ టీమ్ ఆధారంగా రూపొందింది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో 36వ చిత్రం. దీనికి జేక్ ష్రీయర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫ్లోరెన్స్ పగ్ (యెలెనా బెలోవా), సెబాస్టియన్ స్టాన్ (బకీ బార్న్స్), వైట్ రస్సెల్ (జాన్ వాకర్), ఓల్గా కురిలెంకో (టాస్క్‌మాస్టర్), లూయిస్ పుల్‌మన్ (బాబ్ రేనాల్డ్స్/సెంట్రీ), గెరాల్డిన్ విశ్వనాథన్ (మెల్), డేవిడ్ హార్బర్ (రెడ్ గార్డియన్), హన్నా జాన్-కామెన్ (ఘోస్ట్), జూలియా లూయిస్-డ్రేఫస్ (వాలెంటినా అల్లెగ్రా డి ఫాంటైన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 2న విడుదలై, 2 గంటల 7 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.2/10 రేటింగ్ ను పొందింది. ఆగస్ట్ 27నుండి జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళ్తే
యెలెనా అనే రష్యన్ స్పై, బకీ అనే వింటర్ సోల్జర్, రెడ్ గార్డియన్, ఘోస్ట్, టాస్క్‌మాస్టర్, జాన్ వాకర్, బాబ్ అనే వాళ్లను సిఐఏ బాస్ వాలెంటినా ఒక డేంజరస్ మిషన్ కోసం టీమ్‌గా ఏర్పాటు చేస్తుంది. వాళ్లు యాంటీ-హీరోలు, అంటే పూర్తి హీరోలు కాదు. కొంచెం గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్స్. వాలెంటినా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ “సెంట్రీ” గురించి దాచడానికి, వీళ్లను ఒక ట్రాప్‌లో ఇరికిస్తుంది. ఇందులో భాగంగా యెలెనా మలేషియాలో ఒక ల్యాబ్‌ను ధ్వంసం చేస్తుంది. కానీ ఇంతలోనే వాలెంటినా వాళ్లను మోసం చేస్తోందని టీమ్‌కి తెలుస్తుంది. ఆ తరువాత బాబ్ అనే కుర్రాడు సెంట్రీగా మారతాడు. కానీ అతనిలోని డిప్రెషన్, భయాలు “వాయిడ్” అనే డేంజరస్ శక్తిగా మారతాయి.
ఇప్పుడు ఈ టీమ్ న్యూయార్క్‌లోని పాత అవెంజర్స్ టవర్‌లో వాలెంటినాతో ఫైట్ చేస్తుంది. వాయిడ్ న్యూయార్క్‌ను చీకటిలో ముంచేసి, ప్రజలను బంధిస్తుంది. యెలెనా, బాబ్ మనస్సులోకి వెళ్ళి, అతని గతంలోని బాధలను (డ్రగ్స్, సీక్రెట్ ఎక్స్‌పెరిమెంట్స్) ఎదుర్కొంటుంది. టీమ్ అంతా కలిసి బాబ్‌కు హెల్ప్ చేస్తారు. అతను వాయిడ్‌ను కంట్రోల్ చేసి నగరాన్ని కాపాడతాడు. వాలెంటినా తన స్కామ్‌ను కవర్ చేయడానికి టీమ్‌ను “న్యూ అవెంజర్స్”గా బ్రాండ్ చేసి ప్రెస్ మీట్ పెడుతుంది. కానీ యెలెనా ఆమెను మరో బెట్రయల్ గురించి హెచ్చరిస్తుంది. ఈ సిరీస్ క్లైమాక్స్ నెక్స్ట్ సీక్వెల్ కి ఎంట్రీ ఇస్తుంది.