Tamilnadu Incident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరత్తణి వద్ద ఈ రోజూ(సోమవారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పీలేరు మాజీ సర్పంచ్ హుమయున్ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. చెన్నై ఆసుపత్రికి చికిత్స కోసం వెళుతున్న కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులలో మాజీ సర్పంచ్ హుమయున్, ఆయన కొడుకు, తమ్ముడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరు మగ్గురు అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు.
Also Read: దేశంలోనే తెలంగాణ నెం.1.. ఎందులో తెలుసా?
ఘటనపై స్పందించిన మంత్రి రాంప్రసాద్..
ఈ ఘటన గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబలకు సానుభూతి, విషాదాన్ని తట్టకునే ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రహదారుల భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికైన స్థానికులు, ప్రభుత్వ అధికారులు ఇలాంటి ఘటనలు చూసి పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.