E-Paper
Advertisement

Fatal Triangle Love: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే

Fatal Triangle Love: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే
Advertisement

Fatal Triangle Love| ఈ కాలంలో యువతీ యువకులు ప్రేమ పేరుతో డేటింగ్ చేస్తుంటారు. అది కూడా ఒకరితో డేటింగ్ చేస్తూనే మరొకరితో రిలేషన్ లో ఉంటారు. అయితే ఈ రిలేషన్‌షిప్స్ చివరికి బాధనే మిగులుతుంది. అయితే తాజాగా ఒక ముక్కోణపు ప్రేమ కథ నిజజీవితంలో గడిచింది. కానీ ముగ్గురు ప్రేమికుల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరు మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అమరావతి నగరానికి చెందిన శుభాంగి అనే 26 ఏళ్ల యువతి సూరజ్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరికీ గత మూడు సంవత్సరాలుగా పరిచయముంది. అయితే కొన్ని నెలల క్రితం ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ డేటింగ్ కు, పార్టీలకు వెళ్లడం చేసేవారు. అయితే కొన్ని రోజుల క్రితం సూరజ్ తన స్వగ్రామానికి వెళుతున్నట్లు చెప్పాడు. ఆ తరువాత నాగ్ పూర్ లో నివసించే తన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి శుభాంగి వెళ్లింది. పార్టీలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో శుభాంగి షాక్ కు గురైంది.

Advertisement

Also Read: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

అదే బర్త్ డే పార్టీకి ఆమె ప్రియుడు సూరజ్ కూడా వచ్చాడు. అయితే సూరజ్ తో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. వాళ్లద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్టీలో డాన్స్ చేస్తున్నారు. ఆ పార్టీలో శుభాంగి ఉన్నట్లు సూరజ్ గమనించలేదు. ఇదంతా చూసి శుభాంగి తట్టుకోలేకపోయింది. వెంటనే సూరజ్ వద్దకు వెళ్లి అతడిని నిలదీసింది. సూరజ్ తన ప్రియురాలు శుభాంగిని చూసి ఆశ్చర్యపోయాడు.

Advertisement

అయితే శుభాంగి అంతటితో ఆగలేదు. సూరజ్ తో కలిసి డాన్స్ చేస్తున్న మరో యువతి చేయి పట్టుకొని.. సూరజ్ తన బాయ్ ఫ్రెండ్ మాత్రమే అని.. ఇంకెవరూ అతడిని ముట్టుకునేందకు వీల్లేదని చెబుతూ.. ఆ అమ్మాయిని బలంగా తోసేసింది. దీంతో ఆమె కింద పడింది. అయితే శుభాంగి ఇదంతా లెక్కచేయలేదు. ఆమె సూరజ్ ని నిలదీస్తూ ఉండగా.. వెనుక నుంచి సూరజ్ రెండో గర్ల్ ఫ్రెండ్ కోపంగా వచ్చి శుభాంగిపై దాడి చేసింది. అలా వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండగా.. మధ్యలో సూరజ్ వారిని విడగొట్టాలని ప్రయత్నించాడు.

ఆ రెండో గర్ల్ ఫ్రెండ్ కూడా సూరజ్ తనకు మాత్రమే ప్రియుడని.. శుభాంగి తమకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇదంతా విని శుభాంగి పట్టరాని కోపంతో ఆమెను చంపేస్తానని ముందుకుపోయింది. అయితే సూరజ్ రెండో గర్ల్‌ఫ్రెండ్ అక్కడే పక్కన ఉన్న కత్తితో శుభాంగిపై దాడి చేసింది. అంతే పుట్టిన రోజు పార్టీలో అప్పటివరకు అందరూ తమాషా చూసిన వారంతా అక్కడి నుంచి పారిపోయారు. సూరజ్ కూడా తన రెండో గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.

కానీ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభాంగి స్నేహితురాలు, ఇతరులు శుభాంగిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరేలోపే శుభాంగి చనిపోయిదని డాక్టర్లు తెలిపారు. శుభాంగి హత్య కేసులో పోలీసులు సూరజ్ ని అరెస్టు చేశారు. సూరజ్ మరో గర్ల్ ఫ్రెండ్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×