BigTV English

Viral Video: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

Viral Video: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

Viral Video| ఒక పెళ్లికొడుకు అయిదుగురు పెళ్లి కూతుర్లు ఇదీ సీన్. వరుడు ఒక్కొక్కరిగా అయిదుగురు పెళ్లికూతుర్లకు తాళి కట్టాడు. అయిదుగురి నుదుట కుంకుమ సిందూరం పెట్టాడు. సోషల్ మీడియాలో ఈ వింత వివాహం వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఆసక్తిగా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అయితే కొందరు ఇదంతా కామెడీ అని షేర్ చేస్తుంటే.. మరికొందరు ఇదంతా ఇండియాలోనే జరుగుతోందని సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది ఈ వీడియోలో జరిగిన పెళ్లి నిజమేనా అని కామెంట్స్ లో ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ వీడియోలో జరిగిన పెళ్లి గురించి ఫ్యాక్ట్ చెక్ చేయగా నిజం తెలిసింది.


వైరల్ వీడియోలో ఏముంది?
దాదాపు 52 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్స్ లాంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లలో తెగ వ్యూస్ వస్తున్నాయి. మీ వాట్సాప్ కు కూడా బహుశా ఎవరైనా సెండ్ చేసి ఉంటారు. ఈ వీడియోలో ఒక యువకుడు ఒక తెల్ల కలర్ షేర్వానీ ధరించి ఉన్నాడు. అతని చుట్టూ అయిదుగురు యువతులు పెళ్లికూతురు వేషంలో కూర్చొని ఉన్నారు. ఆ యువకుడు ఆ అయిదుగురికి ఒక్కొక్కరిగా నుదుట కుంకుమ సిందూరం పెడుతున్నాడు. ఆ తరువాత ఆ అయిదుగురు యువతులు పెళ్లికొడుకు వేషంలో ఉన్న యువకుడి కాళ్లకు మొక్కుతారు. ఇలాంటిదే మరో వీడియోలో వీరంతా అగ్నిప్రదిక్షణలు చేస్తూ ఏడడుగు నడుస్తూ కనిపించారు.

ఈ వీడియో పై యూజర్ మతంపై విమర్శలు చేస్తూ కామెంట్ చేశాడు. ”ముస్లింలు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని విమర్శించే వారు చూడండి ఈ యువకుడు వాళ్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు. వీడెవడో కానీ ఒకేసారి అయిదుగురు అమ్మాయిలను ఎంతో సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు.” అని కామెంట్ లో రాశాడు.


Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

వీడియో వెనుక నిజమేంటి?
వీడియో గురించి పరిశీలించగా ఇందులో కనిపించే యువకుడి పేరు బ్రజేష్. వీడియోలో అతని వాటర్ మార్క్ యాక్టర్ బ్రజేష్ అని కూడా కనిపిస్తోంది. ఈ పేరుని టైప్ చేసి ఇన్‌స్టగ్రామ్ లో సెర్చ్ చేస్తే.. ఇతని పూర్తి పేరు బ్రజేష్ తివారీ అని తెలిసింది. బ్రజేష్ తివారీ ఇన్‌స్టాగ్రామ్ ఐడి (@actorbrajesh07) అని కనిపిస్తోంది.

ఈ ఇన్‌స్టాగ్రామ్ ఐడి అకౌంట్ లో చాలా డాన్స్ , యాక్టింగ్ వీడియోలు అప్ లోడ్ చేసి ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వైరల్ వీడియోలో కనిపిస్తున్న నటులు వేర్వేరు వీడియోల్లో వేర్వేరు పాత్రలు పోషిస్తూ కనిపించారు. ఇంకా లోతుగా యాక్టర్ బ్రజేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే.. వైరల్ వీడియోలోని నిజమేంటో తెలిసిపోయింది. ఈ వీడియోని బ్రజేష్ దాదాపు 2.5 నెలల క్రితం అప్ లోడ్ చేశాడు.

జ్రజేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు 5 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కూడా బ్రజేష్ చానెల్ కు 13 లక్షల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్‌బు్ లోని ఒక వీడియోలో బ్రజేష్ స్వయంగా తన గురించి చెప్పాడు. తాను కేవలం ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసమే వీడియోలు చేస్తానని చెప్పాడు. అంటే దీనిర్థం.. ఆ వైరల్ వీడియోలో ఉన్నదంతా నిజం కాదు. ఒక వరుడు అయిదుగురు వధువులు అంతా నటన మాత్రమే. ఆ ఎంటర్‌టెయిన్‌మెంట్ వీడియోలో పెళ్లి చేసుకుంటున్నట్లు అంతా నటించారు.

Related News

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Nun Garba Dance: ‘నన్’ వేషంలో గర్బా డ్యాన్స్.. నెట్టింట వీడియా వైరల్.. ఇదేం పైత్యమంటూ కామెంట్స్

Watch Video: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

Indian Arrested: నేరం చేసిన 20 ఏళ్లకు అరెస్ట్.. అమెరికాలో భారతీయుడికి ఊహించని షాక్!

Viral Video: సంస్థలు వేరైనా అందరూ ఒక్కటై.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టిన ఫుడ్ డెలివరీ బాయ్స్.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: సరస్సులో పర్యాటకుల పడవ ప్రయాణం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఏనుగు..

Viral Video: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Food Waste Countries: ఆహార పదార్థాల వృధా దేశాల టాప్ 10 జాబితా ఇదే.. రెండో స్థానంలో భారత్

Big Stories

×