E-Paper
Advertisement

Mahabubnagar: తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కూతురు ప్రేమ.. పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య

Mahabubnagar: తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కూతురు ప్రేమ.. పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య
Advertisement

Mahabubnagar: తీవ్ర విషాదం.. కూతురు ఇతర సామాజిక వర్గం అబ్బాయిని ప్రేమించిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్మసానిపల్లిలో జరిగింది. కూతురు గౌతమి ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో తండ్రి కౌల్ల ఎల్లయ్య మనస్తాపంతో వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం హన్మసానిపల్లి గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య, అతని భార్య అరుణ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం సాగిస్తున్నారు. వారి కూతురు కౌల్ల గౌతమి ఇంటర్మీడియట్ చదువుతుంది.. ప్రశాంతంగా సాగుతున్న వీరి కుటుంబంలోకి ప్రేమ అనే ఒక్క విషయంతో అల్లకల్లోలంగా మారింది. గౌతమి, వాళ్ల గ్రామానికి సమీపంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె చందు అనే యువకుడిని ప్రేమించింది. చందు వడ్డె కులానికి చెందినవాడు, గౌతమి కౌల్ల కులానికి చెందినది. ఇది కులాంతర ప్రేమ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Advertisement

ఇటీవల గౌతమి, చందుతో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి వారు ఆమెను వెతకడానికి, తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి గౌతమిని ఇంటికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఆమెను నచ్చచెప్పేందుకు, కుల విషయంలో పెళ్లి చేసుకోవాలని చాలా సలహాలు, ఆమెను ఒత్తిడి చేశారు. కానీ, గౌతమి తన ప్రేమికుడు చందుతోనే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె వారి తండ్రి మాటలు వినకపోవడంతో ఎల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Also Read: లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ లీడర్స్..

Advertisement

దీంతో సాయంత్రం పొలంలోకి వెళ్లిన ఎల్లయ్య, అక్కడ చెట్టుకు దారం కట్టుకుని ఉరి వేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత భార్య అరుణ, గ్రామస్థులు పొలంలోకి వెళ్లి చూసే సరికి అతను అప్పటికే మరణించినట్లు చెప్పారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అరుణ ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా, కూతురి ప్రేమ విషయంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్లయ్య శవాన్ని పోస్ట్‌మార్టం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లయ్య కూతురి ప్రేమ వల్లే మరణించాడా..? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×