రాజస్థాన్‌లోని రావత్‌భట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) భారీ స్థాయిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 245 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఏడాది పాటు శిక్షణ పొందేందుకు ఇది అద్భుతమైన అవకాశం. ఐటీఐ పూర్తి చేసిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
మొత్తం 245 ఖాళీలలో వివిధ విభాగాలకు ప్రాధాన్యత కల్పించారు. ఫిట్టర్ విభాగంలో 68 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 68 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మెకానిక్ విభాగంలో మరో 68 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. టర్నర్ ట్రేడ్‌లో 10 స్థానాలు కేటాయించారు. మెషినిస్ట్ విభాగంలో 10 పోస్టులు అలాగే వెల్డర్ విభాగంలో 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
గుర్తింపు పొందిన ఐటీఐ సంస్థల నుంచి సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు.
వయస్సు:
2026 మార్చి 18 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9,600 స్టైపెండ్‌గా అందజేస్తారు.
ఉద్యోగ ఎంపిక పక్రియ:
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మెరిట్ జాబితాలో నిలిచిన వారిని ధ్రువపత్రాల పరిశీలన కోసం పిలుస్తారు. అక్కడ అర్హత నిరూపించుకున్న వారికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్‌షిప్ ఇండియా (NAPS 2.0) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎన్‌పీసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు సమర్పించడానికి మార్చి 18 చివరి తేదీగా నిర్ణయించారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 26
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 18
అఫీషియల్ వెబ్ సైట్: https://npcil.nic.in/