Kamareddy News: ఉగాది రోజు కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలోని ఓ చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆదివారం ఉదయం చెరువు దగ్గరకు మౌనికతోపాటు వారి ముగ్గురు వెళ్లారు. అయితే మౌనిక బట్టులు ఉతుకుతోంది. అదే సమయంలో పిల్లలు చెరువులోకి స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా వుండడంతో నీళ్లలో మునిగిపోగారు. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి మౌనిక నీట మునిగి మృతి చెందింది. మౌనిక వయస్సు 26 ఏళ్లు కాగా, మైతిలికి 10 ఏళ్లు, అక్షరకు ఎనిమిదేళ్లు, వినయ్‌కి ఆరేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. నలుగురు నీళ్లలో మునిగి ఊపిరి ఆడకే చనిపోయారా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో వెంకటాపూర్ అగ్రహారంలో విషాదం అలముకుంది.
మరోవైపు తల్లి, ముగ్గురు పిల్లలు మృతిపై మౌనిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలన్నది బంధువుల డిమాండ్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: డేటింగ్ యాప్‌లో ప్రేమ వల.. కట్ చేస్తే ఆరుకోట్లు ఫసక్