Black Magic Man Behead| బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో భయంకరమైన సంఘటన వెలుగుచూసింది. సంతానం పొందాలన్న ఆశతో దంపతులు ఓ వ్యక్తిని నరబలి ఇచ్చారు. సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి తనకు సంతానం కలిగేలా పూజలు చేయమని రిక్యాస్, ధర్మేంద్రను ఆశ్రయించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ నరబలి ఇవ్వాలని నిర్ణయించి, యుగుల్ యాదవ్ అనే 65 ఏళ్ల వృద్ధుడిని కిడ్నాప్ చేసి అతని తల నరికివేశారు. తర్వాత ఆ తలను హోలీ మంటల్లో కాల్చేశారు. యాదవ్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ చేస్తున్న పోలీసులకు ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి.
వివరాల్లోకి వెళితే.. మార్చి 19న గులాబ్ బిఘా గ్రామానికి చెందిన రాజా రామ్ యాదవ్.. మదన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన అన్నయ్య యుగుల్ యాదవ్ బంగారే కనిపించడం లేదని.. గ్రామానికి సమీపంలోని హోలికా దహన్ కార్యక్రమంలో పాల్గొనడానికి సైకిల్‌పై వెళ్లాడని, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు. హోలిక బూడిదలో కొన్ని కాలిన ఎముకలు కనిపించాయని, అతని సోదరుడి చెప్పులు కూడా సంఘటనా స్థలానికి సమీపంలోనే కనిపించాయని అతను పోలీసులకు తెలిపాడు. అలాగే, సమీపంలోని కల్వర్టుపై రక్తపు మరకలు కనిపించాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ సోదరుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసి, అతని మృతదేహాన్ని హోలికాలో దహనం మంటల్లో వేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు ఫిర్యాదు చేశారు.
Also Read: హిజ్రాల బీభత్సం.. డబ్బులు ఇవ్వలేదని ట్రైన్‌లో యువకుడి హత్య
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ యాదవ్ చెప్పులు, కాలిన ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు, రక్తం నుండి DNA నమూనాలను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ట్రాకర్ డాగ్ పోలీసు బృందాన్ని సమీపంలోని పురానాదిహ్ మంజితోలా గ్రామంలోని రామశిష్ రిక్యాసన్ ఇంటికి తీసుకెళ్లింది. కానీ అతను ఇంట్లో కనిపించలేదు. ఆ మరుసటి రోజు రిక్యాసన్ బంధువు ఇంట్లో ఉన్నాడని తెలిసి అక్కడే అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తమ విధానంలో ప్రశ్నించిన తరువాత.. యుగుల్ యాదవ్ హత్యలో తన ప్రమేయాన్ని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తన వద్దకు వచ్చిన దంపతులు పిల్లలు కలగడం లేదనే సమస్య గురించి తెలుపగా.. వారి సమస్య పరిష్కారం కోసం క్షుద్ర పూజ లో భాగంగా ఒక మనిషిని బలి ఇవ్వాలని సూచించాడు.. రామశిష్. అందుకోసమే యుగుల్ యాదవ్ ని హత్య చేసి అతని మొండాన్ని హోలికా దహనంలో కాల్చామని అంగీకరించాడు. క్షుద్ర పూజల కోసమ తలను ఉపయోగించినట్లు తెలిపాడు. అయితే ఇంతకుముందు కూడా ఒక టీనేజర్ యువకుడిని కూడా బలి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
విదేశీ మహిళను లొంగదీసుకున్న తాంత్రికుడు
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇలాంటి ఘటనే జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో ఒక అమెరికన్ మహిళ.. తాంత్రికుడి లైంగిక వాంఛకు బలైంది. ధర్మశాలకు చెందిన ఒక మత నాయకుడిపై ఒక విదేశీ మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. తన సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఆ మత నాయకుడిని ఆశ్రయిస్తే, తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన కొన్ని నెలల క్రితం జరిగిందని పోలీసులు తెలిపారు. కానీ బాధితురాలు దాని గురించి ఇటీవలే ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. ఈ కేసుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ధర్మశాల నుండి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని ఆచూకీ తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన 2024 నవంబర్ 2 నాటిది. ఆ సమయంలో తన భర్త అనారోగ్యం చేయడంతో బుద్ధగయలో చికిత్స చేయిస్తుండగా, మెక్లియోడ్‌గంజ్‌లో కొందరు తంత్ర విద్య ద్వారా చికిత్స చేయవచ్చునని చెప్పడంతో ఆమె భర్త కోరిక మేరకు ధర్మశాలకు వచ్చిందని తెలిపారు. అయితే ఆమె భర్త అనారోగ్యానికి చికిత్స చేస్తానని చెప్పి, ఆమెను ఆ నాయకుడు తంత్ర పూజల పేరుతో లొంగదీసుకున్నాడు. బాధిత మహిళ తన భర్త పట్టుబట్టడం వల్లే మత నాయకుడిని కలిసిందని తెలిపారు.