BigTV English

Fraud In Hyderabad: వారిది అవసరం, వీరిది అవకాశం.. హైదరాబాద్ లో ఇదో కొత్తరకం మోసం

Fraud In Hyderabad: వారిది అవసరం, వీరిది అవకాశం.. హైదరాబాద్ లో ఇదో కొత్తరకం మోసం

రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి.. రక్తదానం అవసరాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి అనేక స్లోగన్లు మనం చూస్తూనే ఉంటాం. రోజుకి ఏదో ఒక వాట్సప్ గ్రూప్ లో రక్తదాతలకోసం పెట్టే మెసేజ్ లు కూడా చూస్తూనే ఉంటాం. అయితే ఈ విషయంలో కూడా మోసాలు జరుగుతాయని మీకు తెలుసా. రక్తదానాన్ని అడ్డు పెట్టుకుని రూ. 500, రూ.1000 సంపాదించేవారు ఉన్నారంటే నమ్మగలరా..? అసలీ మోసం ఎలా చేస్తారు..? ఎందుకు చేస్తారు..? తెలుసుకుందాం.


చార్జీలకివ్వండి చాలు..
“నా పేరు ఫలానా.. రక్తదాత కోసం వాట్సప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ నేను చూశాను. నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్. రక్తదానం చేయడానికి నేను రెడీ. ఇప్పటికిప్పుడు మీరు చెప్పిన ఆస్పత్రికి వచ్చేద్దామని బయలుదేరాను. అయితే ఆస్పత్రి వరకు రావడానికి నా దగ్గర చార్జీలకు డబ్బులు లేవు. బస్ లో, లేదా మెట్రోలో వస్తే బాగా లేట్ అవుతుంది. వెహికల్ లో వస్తాను, జస్ట్ మీరు చార్జీలు ఇస్తే చాలు, నా ఫోన్ పే నెంబర్ కి అమౌంట్ వేయండి.” అంటూ కొంతమంది ఇటీవల కొత్త మోసాలకు తెరతీశారు. నిజంగానే తమ కోసం వస్తున్న ఆ దయార్ధ్ర హృదయుడి దగ్గర డబ్బులు లేవేమో అని చాలామంది జాలి చూపిస్తుంటారు. పైగా అది తమ అవసరం కాబట్టి కచ్చితంగా డబ్బులు వేస్తారు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. డబ్బులు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత అవతలి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇక ఆ ఫోన్ మోగదు. దీంతో ఇవతలి వ్యక్తుల్లో టెన్షన్ మొదలవుతుంది. దాత వచ్చి రక్తం ఇస్తాడో లేదో తెలియదు, అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈలోగా ఇక్కడ పేషెంట్ పరిస్థితి సీరియస్ అని చెబితే మరొక రక్తదాతను వెదుక్కోవాలి. ఇలా కొంతమంది పేషెంట్ బంధువులు మోసపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దందా బాగా జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఇక్కడ మోసపోయిన వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. వెయ్యి, రెండువేల కోసం వారు పోలీస్ కంప్లయింట్ ఇవ్వలేరు, అలాగని ఆ నెంబర్ ని ట్రేస్ చేయలేరు. వారం పదిరోజుల తర్వాత ఆ సంఘటన గురించే వారు మరచిపోతారు.

ఇలా చేస్తే ఎలా..?
రక్తదాతల పేరుతో డబ్బులు గుంజే బ్యాచ్ హైదరాబాద్ తోపాటు చాలా చోట్ల ఉన్నట్టు ఉదాహరణలున్నాయి. ఈ బ్యాచ్ వల్ల అసలు రక్తదాతల పరువు పోతోంది. వీరు కేవలం డబ్బులకోసం ఆశపడి రక్తదానం చేస్తామంటూ కబుర్లు చెప్పేవారు. డబ్బులు అకౌంట్ లో పడ్డాక ఫోన్లు స్విచాఫ్ చేసే బ్యాచ్. ఇలాంటి ఉదాహరణలు చూశాక, రేపు నిజమైన రక్తదాతల విషయంలో కూడా చాలామంది అనుమానపడే అవకాశముంది. రక్తదాతలు ఎవరైనా వస్తున్నారంటే వారు కూడా అదే బ్యాచ్ నా అని ఆలోచిస్తారు. దీనివల్ల అసలు మానవ సంబంధాలకే మరకలు అంటుకునే పరిస్థితి.


ఇలా చేయండి..
ఒకవేళ ఎవరైనా రక్తదాతల పేరుతో మోసం చేస్తే వారిన ఊరికే అలా వదిలేయొద్దని పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని చెబుతున్నారు. బాధితులు సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అధికారులు. సైబర్‌ క్రైమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930 కి కాల్ చేయొచ్చు. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మోసం జరిగింది వెయ్యి, రెండువేల విషయంలోనే కదా అని వదిలేయొద్దని చెబుతున్నారు పోలీసులు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే మోసం చేయాలనుకునేవారు తగ్గుతారని అంటున్నారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×