Mohan Lal: మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు మోహన్ లాల్ (Mohan Lal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళం చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా దూసుకుపోతున్న ఈయన ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే మొదటిసారి ఈయన ఓ నగల సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. గతంలో కూడా ఇలా పలు నగల సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన కేవలం నగలు గురించి ఆ షోరూం లో లభించే ఆఫర్ల గురించి మాత్రమే తెలియజేసేవారు. తాజాగా ఈయన మాత్రం ఏకంగా చేతికి గాజులు, మెడలో దండ వేసుకొని మరి ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది.
నగలను మాయం చేసిన నటుడు..
తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండానే అందరినీ మెస్మరైజ్ చేశాడు. కేవలం అతని కళ్ళు, హావభావాలు మాత్రమే చూపించాడు. ఇందులో మోహన్ లాల్ కు ఓ మోడల్‌ను పరిచయం చేస్తారు. ఈక్రమంలోనే ఆమె మెడలోంచి తీసిన నగలను బాక్స్‌లో పెడతారు. ఆ నగలను చూసినా మోహన్ లాల్ ఎవరికి తెలియకుండా ఆ నగలను మాయం చేస్తారు. చివరికి ఆ నగల బాక్స్ ఓపెన్ చేయగా అందులో నగలు కనిపించకపోవడంతో నగలు కనిపించలేదు అంటూ అనౌన్స్మెంట్ ఇస్తారు.
చేతికి గాజులు, మెడలో దండ …
నగల కోసం అందరూ వెతుకుతూ ఉండగా మోహన్లాల్ మాత్రం ఒక గదిలో చేతికి గాజులు మెడలో దండ వేసుకొని వాటిని చూసుకుంటూ మైమరిచిపోతూ ఉంటారు.అవన్నీ తన ఒంటిపై వేసుకుని అమ్మాయిలా ఫీల్ అవుతాడు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన విన్స్‌మేరా(Vinsmera) అధినేత ప్రకాష్ వర్మ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ అడగడంతో మోహన్ లాల్ ఆ నగలను దాచేస్తారు ఆ తర్వాత వారిద్దరూ నవ్వుకుంటారు అంతటితో ఈ యాడ్ పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ విధంగా మోహన్ లాల్ విన్స్‌మేరా నగలను (Vinsmera Jewellery) ఎంతో విభిన్నంగా ప్రమోట్ చేస్తూ షేర్ చేసిన ఈ వీడియో పై అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఏంటి నగలను కేవలం అమ్మాయిలు మాత్రమే ప్రమోట్ చేయాలా? అబ్బాయిలు చేయకూడదా? అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం మొదటిసారి ఒక హీరో ఇలా నగలను ప్రమోట్ చేయడం కొత్తగా ఉందని ఈ వీడియో ద్వారా మోహన్ లాల్ ట్రెండ్ సెట్ చేశాడు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరోవైపు మోహన్ లాల్ చేతికి గాజులు, మెడలో దండ వేసుకోవడంతో ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ సినీ కెరియర్ విషయానికి వస్తే..ఇటీవల ఆయన నటించిన ‘తుడరుమ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోహన్ లాల్ ‘హృదయ పూర్వం'(Hridaya Poorvam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో మాళవిక మోహన్(Malavika Mohanan) అని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది.
Also Read: Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ ఒక్కో సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మరీ దారుణం?