BigTV English

Woman For Sale: ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

Woman For Sale:  ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

Woman For Sale| ఇంట్లో ఆర్థిక సమస్యలుండడంతో ఆమె ఉద్యోగం కోసం నగరానికి వచ్చింది. అక్కడ ఒక యువకుడు పరిచయమయ్యాడు. యువకుడు ఈ అమాయక యువతితో స్నేహం చేశాడు. ఆ తరువాత ఆమె సమస్యలు విని తనకు తెలిసిన చోట మంచి ఉద్యోగం ఇప్పిస్తానని.. నెలకు మంచి జీతం ఉంటుందని మరో రాష్ట్రానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో వ్యక్తితో ఈ యువతికి పరిచయం చేశాడు. ఆ తరువాత ఆ యువకుడు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి రాలేదు. అయితే ఈ యువతిని కొందరు వ్యక్తులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి మరో ప్రదేశంలో విక్రయించేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగింది.


వివరాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్ర కు చెందిన చైత్ర(20, పేరు మార్చబడినది) తన ఇంట్లో ఆర్థిక సమస్యలుండడంతో గ్రామం వదిలి ఠాణె పట్టణానికి ఉద్యోగం కోసం వచ్చింది. అక్కడ తన స్నేహితురాలి ఇంట్లో కొన్ని రోజులపాడు బస చేసింది. అక్కడే పక్కింట్లో ఉన్న సుందర్ అనే యువకుడు చైత్రకు పరిచయమయ్యాడు. ఒక రోజు చైత్ర సమస్యలు విన్న సుందర్ ఆమెకు సహాయం చేస్తానని.. మంచి ఉద్యోగం కావాలంటే తనతో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు రావాలని చెప్పాడు. దీంతో చైత్ర.. సుందర్ వెంట జబల్ పూర్ నగరానికి ఏప్రిల్ నెలలో వెళ్లింది.

జబల్ పూర్ లో ఒక పెద్ద భవనంలో సుందర్.. చైత్రను తీసుకెళ్లాడు. అక్కడ మరో వ్యక్తితో చైత్రకు పరిచయం చేశాడు. ఆ తరువాత సుందర్ ఆ వ్యక్తి నుంచి రూ.5000 తీసుకున్నాడు. ఇదంతా చైత్ర చూస్తుండగా.. సుందర్ అక్కడి నుంచి లేచివెళ్లిపోతున్నాడు. చైత్ర కంగారుతో తనను ఒంటరిగా వదిలి వెళ్లద్దొని సుందర్ ని అడిగింది. సుందర్ ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత చాలా సేపు వరకు సుందర్ తిరిగిరాలేదు. చైత్ర కూడా అక్కడి నుంచి లేచి బయటికి వెళుతుండగా.. ఒక 55 ఏళ్ల మహిళ అక్కడికి వచ్చి ఆమెను అడ్డుకుంది. ఇక నుంచి అక్కడే ఉండాలని బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని భయపెట్టింది. ఆమె మాటలు విన్న చైత్రకు చెమటలు పట్టాయి.


చైత్ర ఆమెతో కాసేపు వాదించింది. అప్పుడా మహిళ చైత్రకు నిజం చెప్పింది. సుందర్ ఒక మోసగాడని.. చైత్రని కేవలం రూ.5000 తమకు విక్రయించివెళ్లిపోయాడని నిజం బయటపెట్టింది. దీంతో చైత్ర షాక్ కు గురైంది. అయినా చైత్ర అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. ఆమెను బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. బాగా రక్తం వచ్చేలా కొట్టారు. మరుసటి రోజు చైత్రకు వ్యభిచారం చేయమని చెప్పారు. వారి మాటలు వినకపోతే కరెంట్ షాక్ ఇచ్చేవారు. ఆ చిత్రహింసలు భరించలేక చైత్ర వ్యభిచారం వృత్తిలోకి దిగింది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

అయితే రెండు నెలల తరువాత జబల్ పూర్ పోలీసులకు ఒక హోటల్ లో విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని సమాచారం అందింది. అక్కడ పోలీసులు వెంటనే రైడ్ చేసి నలుగురు థాయ్ ల్యాండ్ యువతులతో పాటు చైత్రను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఒక యమన్ దేశానికి చెందిన అబ్దుల్లా ముగేద్ (42) అనే బ్రోకర్ ని కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత విచారణలో చైత్రకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న పోలీసులు.. సుందర్, చైత్రను హింసించి ఆమె చేత బలవంతంగా వ్యభిచార వృత్తి చేయిస్తున్న మహిళలపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో సుందర్ ని, ఆ మహిళలను త్వరలోనే పట్టుకుంటామని.. పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చైత్ర ఒక మహిళా సంక్షేమ గృహంలో చికిత్స పొందుతోంది.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×