BigTV English

Russian attacks on Ukraine: ఉక్రెయిన్ పై రష్యా దాడులు..నలుగురి మృతి

Russian attacks on Ukraine: ఉక్రెయిన్ పై రష్యా దాడులు..నలుగురి మృతి

Russian attacks on Ukraine kill 4 and injure 37: సుదీర్ఘకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య రాజుకున్న అగ్గి చల్లారడం లేదు. మరో సారి తమ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఉక్రెయిన్ సైన్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహోదగ్ధుడయ్యారు. ప్రతీకార చర్యలో భాగంగా పుతిన్ ఆదేశాలపై రష్యా సేన ఉక్రెయిన్ దేశంపై ప్రతిదాడులకు పాల్పడింది. అత్యం శక్తివంతమైన వాయుసేనకు సంబంధించిన రాకెట్ లాంచర్లతో భీకరంగా విరుచుకుపడింది. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలపై రష్యా సేన బాంబుల వర్షం కురిపించింది. డొనెస్క్, ఖార్జీవ్, చెర్నిహివ్, సుమీ ప్రాంతాలపై రష్యా మిసైల్స్ చొచ్చుకువచ్చాయి. ఈ బాంబు దాడుల్లో నలుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా ముప్పయి ఏడు మందికిక పైగా గాయాలయ్యాయి.


యుద్ధ డ్రోన్లతో రష్యా హల్ చల్

ఉక్రెయిన్ దేశంలోని మైకోలైవ్ ప్రాంతంలో రష్యా ప్రయోగించిన యుద్ధ డ్రోన్లు పది దాకా చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని ఉక్రెయిన్ సైనిక దళాలు కూల్చివేశాయి. శనివారం ఉక్రెయిన్ 33వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. కాగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ పౌరులు నిరాడంబరంగానే తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుస్కరించుకుని ఇరు దేశాలూ శనివారం యుద్ధ ఖైదీలను మార్చుకోవడం జరిగింది. రష్యా సేనకు పట్టుబడిన 50 మంది ఉక్రెయిన్ దేశస్థులను విడిచిపెట్టారు. అలాగే రష్యాకు చెందిన 115 మందిని ఉక్రెయిన్ విడిచిపెట్టింది. ఇది జరిగిన 24 గంటలలోపే మరోసారి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటం గమనార్హం.


Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×