Minor girl gang raped in UP(Today latest news Telugu): ఆడపిల్లలు, మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే.. వెలుగులోకి రాకుండా చీకట్లోనే మగ్గిపోతున్న చీకటి కోణాలెన్నో. అబలలపై అత్యాచారానికి తెగబడిన వారిని ఎంత కఠినంగా శిక్షించినా, ఎన్ని చట్టాలొచ్చినా ఫలితం లేదు. చిన్న మార్పు కూడా రావట్లేదు. కామ కోరికలు తీర్చుకునేందుకు ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఆడపిల్లలపై జరిగే దారుణాలే. ఇక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదని అందరికీ తెలుసు. గతంలో ఎందరో ఆడపిల్లలు ఇక్కడ కామాంధుల దాహానికి బలైపోయారు. తాజాగా యూపీలో 15 సంవత్సరాల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బరేలీలోని ఫరీద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం చేసి.. పరారయ్యారు.
Also Read : ఇంటర్వ్యూలో సెలక్ట్, ఇంటికొస్తే సిమ్ ఇస్తా, రేప్ చేయబోయి..
బాలికపై కామవాంఛ తీర్చుకున్న నీచులు.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కాళ్లు, చేతులు కట్టేసి ట్రాలీ కింద పడేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని ట్రాలీ కిందనున్న చిన్నారిని రక్షించారు. మైనర్ స్పృహలోకి వచ్చాక ఆమెతో మాట్లాడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని, తన తల్లితో జరిగిందంతా వివరించిందని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.