రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. గతంలో ఇలాంటి మార్పులు చూశారా ? అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏపీలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ ఐదేళ్లలో ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టారో అనే అంశాలపై ప్రజలకు వివరించారు.
‘గత 59 నెలల్లో మహిళల ఖాతాల్లో రూ. 2.70 లక్షల కోట్లు వేశాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపరిచాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరు మీద ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంటి దగ్గరే రేషన్, పౌర సేవలు, పథకాలు అందించాం. రైతుల కోసం రైతుభరోసా, రైతు బీమా, పగటిపూట 9 గంటల విద్యుత్ అందించాం. ఇలాంటి మార్పులు గతంలో చూశారా? శ్రమజీవుల కోసం తోడు, చేదోడు వంటి పథకాలు తీసుకొచ్చాం. స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఇలాంటి పథకాలు గతంలో చూశారా? విద్యారంగంలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చాం. మహిళల కోసం చేయూత, ఆసరా, సున్నా వడ్డీ వంటి పథకాలు తీసుకొచ్చాం’ అని ఆయన అన్నారు.
‘మరో 36 గంటల్లో ఎన్నికల సమరం జరగబోతోంది. బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు.. ఇంటింటా అభివృద్ధి జరుగుతుంది. అదే చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు.. మళ్లీ మోసపోవడమే అవుతుంది. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే’ అని ఆయన అన్నారు.
Also Read: అంతర్గత సర్వే, పిఠాపురంలో పవన్‌కే మొగ్గు!
‘లంచాలు, వివక్షత లేని ఇలాంటి పాలన గతంలో చూశారా?. పేదలు, పెత్తందారుల మధ్య యుద్దం జరుగుతోంది. అవ్వా తాతలకు రెండు నెలల క్రితం వరకు ఇంటి దగ్గరకే పెన్షన్ వచ్చేది. కానీ, దానిని ఆపి చంద్రబాబు వారి ఉసురుపోసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతు పట్టుకుని పిసికేస్తున్నారు. మహిళలకు డబ్బు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్ర చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. రిషికొండలో బాలకృష్ణ, మంగళగిరిలో దత్తపుత్రుడు భూములు కొన్నారు.. వారికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా?’ అని జగన్ ప్రశ్నించారు.