E-Paper
Advertisement

Allu Arjun: పవన్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి మద్దతు.. ?

Allu Arjun: పవన్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి మద్దతు.. ?
Advertisement

Allu Arjun latest news(Today tollywood news): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జనసేనకు షాక్ ఇచ్చాడా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతలా బన్నీ ఏం చేశాడు అంటే.. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారం ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోరాహోరీగా సాగుతున్న ఈ ప్రచారాలలో టాలీవుడ్ మొత్తం పవన్ కు సపోర్ట్ గా నిలిచింది. మెగా హీరోలు పిఠాపురం లో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక ప్రచారం చేయకపోయినా అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కు మద్దతు పలికాడు.

ఆయన్ను చూస్తే గర్వంగా ఉందని, పవన్ తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చాడు. దీంతో బన్నీ సపోర్ట్ పవన్ కే అనుకున్నారు. ఇక ఈ ట్వీట్ చేసి రెండు రోజులు కూడా కాకముందే బన్నీ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు రోజుల్లో ఏం జరిగింది అని గుసగుసలు మొదలయ్యాయి. నేడు నంద్యాలలో వైసీపీ అభ్యర్థి అయినా శిల్పా రవిచంద్రారెడ్డిని కలవడానికి బన్నీ.. భార్యతో సహా కలిసి వెళ్ళాడు.

Advertisement

ఇక నంద్యాలకు బన్నీ వస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు పోటెత్తారు. బన్నీని చూడడానికి అభిమానులు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ వెళ్ళింది.. కేవలం స్నేహం కోసం మాత్రమే అని తెలుస్తోంది. అవును.. శిల్పా రవిచంద్రారెడ్డి, బన్నీ భార్య స్నేహ రెడ్డి మంచి స్నేహితులు. ఇటు పక్క బన్నీకి, శిల్పా రవిచంద్రా రెడ్డికి మంచి అనుబంధం కూడా ఉంది. దీంతో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శిల్పా రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ చెప్పడానికి మాత్రమే ఈ భార్యాభర్తలు వారి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రచారం ఏది అల్లు అర్జున్ చేయడం లేదని సమాచారం.

ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. మొదటి నుంచి కూడా బన్నీ,పవన్ తరపునే మద్దతుగా నిలబడ్డాడు. ఇప్పుడు కూడా ఆయన.. పవన్ కు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు. స్నేహం కోసం మాత్రమే బన్నీ రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇక సాయంత్రంలోపు ఆయన రిటర్న్ అవుతాడు అని తెలుస్తోంది. బన్నీని చూడడానికి మాత్రమే అంతమంది జనాలు వచ్చారు తప్ప.. వైసీపీ ప్రచారం కాదని తెలుస్తోంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×