E-Paper
Advertisement

Man Rape on Attempt Techie Woman: ఇంటర్వ్యూలో సెలక్ట్.. ఇంటికొస్తే సిమ్ ఇస్తానని చెప్పి.. రేప్ చేయబోయి..

Man Rape on Attempt Techie Woman: ఇంటర్వ్యూలో సెలక్ట్.. ఇంటికొస్తే సిమ్ ఇస్తానని చెప్పి.. రేప్ చేయబోయి..
Advertisement

Manager Rape Attempt on Techie Woman in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీరిస్తే ఉద్యోగం ఇస్తానంటూ యువతిని నమ్మించాడు. లైంగిక వేధింపులకు గురి చేశాడు ఓ కామాంధుడు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు. ఇంటికి వచ్చి ఆఫీసు సిమ్ కార్డు తీసుకోవాలని సూచన చేశాడు. ఇంటికి వచ్చిన ఆమెపై అత్యాచారం చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు.

స్టోరీ లోతుల్లోకి వెళ్తే.. లోకేషన్, అమీర్‌పేట్ ఎంజీఎం గ్రాండ్ 9 అంతస్తు. టెక్ ఫ్లో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీలో 29 ఏళ్ల నవీన్‌కుమార్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆ కంపెనీలో జాబ్ కోసం ఓ యువతి వచ్చింది. ఆమె తీసుకొచ్చిన డీటేల్స్ చెక్ చేసుకున్నాడు. అసలే కామాంధుడు ఆమెని ఆఫీసులో దాదాపు రెండు గంటలపాటు కూర్చోబెట్టి డీటేల్స్ తీసుకున్నాడు. కామంతో కళ్లు మూసిపోయాడు నవీన్. ఆమెని తన వశం చేసుకోవాలని ఆరాటపడ్డాడు. ఆమెకి ఎలా చెప్పాలని మైండ్‌లో ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాడు.

Advertisement

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారన్నాడు. ఆమె ముఖంలో పట్టరాని సంతోషం. తక్కువ సమయంలో జాబ్ రావడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కళ్లతో ఆమె పరిస్థితి గమనించిన కామాంధ మేనేజర్, ఆఫీసు సిమ్ కోసం ఎల్లారెడ్డిలో ఉన్న తన ఇంటికి వచ్చి తీసుకోవాలని మెలిక పెట్టాడు. కాసేపు ఆ యువతి ఆలోచించింది. చివరకు మంగళవారం సాయంత్రం నవీన్ ఇంటికి వెళ్లింది ఆ యువతి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను కూర్చోబెట్టాడు, కాసేపు మాట్లాడాడు.

Also Read: Minor Assault : మైనర్ పై గ్యాంగ్ రేప్.. పేట్రేగిపోయిన నీచులు

Advertisement

ఆ తర్వాత యువతి ఒంటిపై ఉన్న వస్త్రాలను లాగి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కేకలు పెడితే పరువుపోతుందని భావించిన ఆ యువతి.. కామాంధుడి బారి నుంచి తప్పించి నేరుగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు, నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. క్షణికావేశంలో నవీన్ చేసిన తప్పు, చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×