BigTV English

Wife Torture: ‘మా ఆవిడ నన్ను కొడుతోంది.. నేను జైల్లో ఉంటా?’.. ఇంటి నుంచి పారిపోయిన భర్త!

Wife Torture: ‘మా ఆవిడ నన్ను కొడుతోంది.. నేను జైల్లో ఉంటా?’.. ఇంటి నుంచి పారిపోయిన భర్త!

Wife Torture| భార్యలను కొట్టే భర్తల గురించి వింటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు సీన్ రివర్స్ కూడా అవుతూ ఉంటుంది. తాజాగా బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు తన భార్య పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆ యువకుడు తప్పిపోయినట్లు అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువకుడి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. పైగా ఆ మహిళ పోలీసులపై ఒత్తిడి చేసింది. దీంతో పోలీసులకు కూడా ఆమె సాధారణ వనిత కాదని తెలిసి వచ్చింది. అయితే 10 రోజుల తరువాత అనుకోకుండా ఆ యువకుడు ఢిల్లీ లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు అతడిని పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అప్పుడా యువకుడు తనను జైలకు పంపండి కానీ.. తన భార్యకు అప్పగించ వద్దని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే..


పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరు నార్త్ ‌కు చెందిన సుకుమార్ (32, పేరు మార్చబడినది) కు మూడేళ్ల క్రితం చండిక(30, పేరు మార్చబడినది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే చండికకు ఇది రెండో వివాహం. ఆమెకు మొదటి భర్త వల్ల 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. సుకుమార్ ఆమె ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. సుకుమార్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అయితే వీరిద్దరికీ 8 నెలల ఒక పాప కూడా ఉంది.

ఈ క్రమంలో సుకుమార్, తన భార్యతో కలిసి ఆగస్టు 4న షాపింగ్ కోసం వెళ్లాడు. అక్కడ తన వద్ద నగదు లేదని చెప్పి.. ఎటిఎం నుంచి డబ్బులు తీసుకురావడానికి వెళ్లాడు. ఆ తరువాత తిరిగిరాలేదు. ఎంతసేపు వెతికినా సుకుమార్ రాకపోయేసరికి.. చండిక ఇంటికి తిరిగి వచ్చింది. సుకుమార్ ఫోన్ చేస్తే.. స్విచాఫ్ అని చండికకు తెలిసింది. ఆ రోజంతా సుకుమార్ ఇంటికి రాలేదు. మరుసటి రోజు చండిక.. పోలీస్ స్టేషన్ వెళ్లి తన భర్త తప్పిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఫిర్యాదు నమోదు చేసుకొని సుకుమార్ ఫోన్ ట్రాక్ చేశారు. కానీ ఫలితం లేదు. రెండు రోజుల తరువాత చండిక పోలీస్ స్టేషన్ కు మళ్లీ వెళ్లింది. తన భర్తను వెతికిపెట్టారా? అని ప్రశ్నించింది. దానికి పోలీసులు.. విచారణ చేస్తున్నామని ఆమెకు చెప్పారు. దీంతో చండిక ఆగ్రహంగా పోలీసులతో మాట్లాడింది. సోషల్ మీడియాలో పోలీసులు తన భర్తను వెతికిపెట్టడం లేదని.. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని పోస్టుల పెట్టింది.


దీంతో పోలీసులకు చండిక సామాన్యురాలు కాదు అని అర్థమైపోయింది. సుకుమార్ కోసం వెతకడానికి నగరంలోని సిసిటీవి వీడియోలన్నీ గాలించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్నీ వెతికారు. కానీ సుకుమార్ జాడ తెలీలేదు. అయితే సుకుమార్ తన పాత ఫోన్ లో కొత్త సిమ్ కార్డు వేశాడు. దీంతో పోలీసులు.. సుకుమార్ పాత ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను ట్రాక్ చేయగా.. అతడు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. బెంగుళూరు పోలీసులు ఢిల్లీ లోని నోయిడా ప్రాంతానికి బయలుదేరారు. నోయిడాలోని ఒక షాపింగ్ మాల్.. మల్టీప్లెక్స్ లో సుకుమార్ సినిమా చూసి బయటికి వస్తుండగా.. అతడిని పట్టుకున్నారు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

అయితే పోలీసులతో సుకుమార్ తాను ఇంటికి వెళ్లనని.. చండిక తనను కొడుతూ ఉంటుందని.. ఇంట్లో సరిగా తిండి, నిద్రలేక తాను చండిక పెట్టే చిత్రహింసలు భరించలేనని తెలిపాడు. కావాలంటే తనను జైల్లో పెట్టండి, అని పోలీసుల ముందు ఏడ్చాడు. కానీ పోలీసులు అతనిపై కనికరించలేదు. వెంటనే సుకుమార్ ను తీసుకొని బెంగుళూరు ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.

బెంగుళూరులో పోలీసులు సుకుమార్ స్టేట్ మెంట్ తీసుకొని చండిక కు అప్పిగించారు. ఈసారి సుకుమార్ తప్పించుకోకుండా చండికా జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి తీసుకెళ్లింది. ఆ తరువాత ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి!.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

 

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×