Gang Rape on Minor Girl: ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించిన దేశంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కొందరు మృగాళ్లు వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై కొందరు కామాంధులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 4 రోజులు నిర్బంధించి అత్యాచారం చేశారు. నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా SP గంగాధర్.. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల(మార్చి 13న) జి. కొండూరుకు చెందిన బాలిక స్నేహితురాళ్లతో కలిసి వీరపనేనిగూడెం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ యువతి ఇంట్లో గొడవలు జరిగాయి. గొడవకు కారణం బాధిత బాలిక కారణమంటూ.. కుటుంబసభ్యులు కోపగించుకోవడంతో.. మనస్తాపానికి గురైన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
బాలికను అపహరించి..
వీరపనేని గూడెంలో మద్యం సేవిస్తున్న రజాకర్ అనే మైనర్ బాలుడు బాలికను గమనించి.. ఆమెతో మాయమాటలు కలిపాడు. తన గురించి తెలుసుకుని మీ ఇంటికి తీసుకెళతానని నమ్మించి.. బైక్‌పై ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి అఘాయత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను అనిల్, జితేంద్ర అనే ఇద్దరు దగ్గరు తీసుకెల్లాడు.. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలికను ట్రాప్ చేసిన నిందితులు.. 4 రోజులు నిర్బంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. చివరకు బాలికను మార్చి 17న విజయవాడలో వదిలేసి వెళ్లిపోయారు.
ఆటో డ్రైవర్ చొరవతో
బాలిక పరిస్థితిని గమనించి ఓ ఆటో డ్రైవర్ ఆరా తీయడంతో.. ఆమె విషయమంతా చెప్పింది. ఆ ఆటో డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలిక అప్పటికే నీరసించి పోయి ఉండడంతో వెంటనే ఆమెకు చికిత్స అందించారు. అప్పటికే బాలిక కనిపించడం లేదని వీరపనేని గూడెం పోలిస్టేషన్‌లో కేసు నమోదు అయింది. విజయవాడ మాచవరంలో బాలికను గుర్తించిన పోలీసులు హాస్పటల్ కి తరలించారు. వీరపనేని గూడెం నుంచి వెళ్లిపోయిన బాలిక జి. కొండూరు వెళ్లి ఉంటుందని భావించారు. కాని ఆమె కనిపించడంలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: దారుణ ఘటన.. మహిళను చంపి.. శరీర భాగాలను ముక్కలు చేసి
బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు..
బాలిక కనిపించడం లేదని ఆత్కూరు పోలీస్టేషన్‌లో తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసి బాలికను అఘాయత్యానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. పలుమార్లు ఏడుగురు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు గుర్తుంచారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.