Crime News: అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కశింకోట మండలంలో దారుణ హత్య జరిగింది. బయ్యవరం జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు కింద గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా చంపారు. దుప్పటిలో మృతదేహం చుట్టి ఉండడం చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం మృతదేహాన్ని మహిళగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడి మహిళా శరీర భాగాలను వేరు చేసి దుప్పటిలో చుట్టి కల్వర్టులో పడేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. బెడ్ షీట్ లో మహిళా చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారుగా 40 ఏళ్లు ఉండొచ్చని స్థానిక సీఐ స్వామి నాయుడు చెప్పారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను బట్టగి క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు. అసలు ఈ మహిళను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఈ దారుణ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ రోజు అధికారులతో మాట్లాడి సంఘటన గురించి మంత్రి ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా ఎస్సీ తుహిన్ సిన్హాకు ఫోన్ కాల్ చేసి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి దుండుగులను పట్టుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దుండుగులకు పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇంత కిరాతకంగా మహిళను హత్య చేయడంపై దారుణం అని మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
ALSO READ: Exim Bank: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,05,280.. దరఖాస్తు పూర్తి వివరాలివే..