Sunita Williams: కేవలం వారం రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ అక్కడేం చేశారు? మరో వ్యోమగామి విల్మోర్ తొమ్మిది నెలలు గడిపారు.ఈ వ్యోమగాములు అక్కడ ఎలాంటి పరిశోధనలు చేశారు? కేవలం ఐఎస్‌ఎస్ నిర్వహణ మాత్రమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా వ్యవసాయంపై పరిశోధనలు చేశారు. ఈ విషయాన్ని సునీత విలియమ్స్ ఒకానొక సందర్భంలో బయట పెట్టారు. ఇంతకీ ఆ పరిశోధనలు ఏంటి? భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
తొమ్మిది నెలలుపాటు అంతరిక్షంలో గడిపారు వ్యోమగామి సునీత విలియమ్స్. గంటల కొద్దీ ఇంట్లో ఉంటే బోరుగా ఉంటుంది. అప్పుడప్పుడు కాసేపు అలా బయటకు వెళ్తాము. అలాంటి తొమ్మిది నెలల పాటు రోదసిలో గడపడం ఆశామాషి కాదు. ఇక అంతరిక్షం గురించి చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా షూటు వేసుకోవాల్సిందే. అలాగని బయట ఏమీ చేయలేని పరిస్థితి. గంటల తరబడి అంతరిక్షం కేంద్రంలో లోపల ఏమైనా పరిశోధనలు చేయడానికి మాత్రమే అవుతుంది. సునీత విలియమ్స్ కూడా అదే జేశారు.
అంతరిక్షంలో వ్యవసాయం
అంతరిక్ష కేంద్రంలో రోజువారీ బాధ్యతలు సునీత, విల్మోర్ చూసుకునేవారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి మరమ్మతులు చేపట్టారు. అక్కడ చిన్నచిన్న పరిశోధనలు చేశారు. దాదాపు 150కి పైగా ప్రయోగాలు చేసినట్టు తెలుస్తోంది. ఆమె ప్రయోగాలు రాబోయే అంతరిక్ష కార్యకలాపాలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అంతరిక్ష ఆవాసాలలో ఆహార ఉత్పత్తికి గణనీయమైన ప్రభావాలను చూపుతాయి.
అంతరిక్ష వ్యవసాయం, భార రహిత స్థితిలో శారీరక ఆరోగ్యం వంటి వాటిపై పరిశీలన చేశారు సునీత విలియమ్స్. ఐఎస్‌ఎస్‌లో అడ్వాన్స్‌డ్ ప్లాంట్ హ్యాబిటెట్‌లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు చేపట్టారు. తేమలో వచ్చే వైరుద్ధ్యాల వల్ల మొక్కలు, నీటి వ్యవస్థల్లో సూక్ష్మ జీవులపై ఎలాంటి ప్రభావం పడుతోందన్నది పరిశీలించారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో అద్భుతమైన రోమైన్ లెట్యూస్ పెరుగుదలపై దృష్టి సారించారు.
ALSO READ: తొమ్మిది నెలల తర్వాత భూమిపై సునీత
భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు ఇది కీలకం కానుంది. భూమిపై వ్యవసాయ పురోగతిలో కీలకమైన అంశం ఇది. మొక్కల పెరుగుదలను వివిధ పరిమాణాల్లో నీరు ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధించడం ప్రధాన లక్ష్యం. నాసా సమాచారం మేరకు సునీత విలియమ్స్ రాబోయే అడ్వాన్స్‌డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఇది అంతరిక్షం, భూమిపై ఆహార ఉత్పత్తి పద్ధతులను మెరుగు పరచనుంది.
విలియమ్స్ తన తోటి వ్యోమగామి హేగ్‌కు వైద్య పరీక్షలకు తనవంతు మద్దతు ఇచ్చేది. సూక్ష్మ గురుత్వాకర్షణలో వివిధ నీటి పరిస్థితులకు మొక్కలు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవచ్చు. భూమిపై నీటి లేని శూన్య ప్రాంతాలలో మెరుగైన వ్యవసాయ పద్ధతులు ఎలాగన్నది తెలుసుకోవచ్చు.
స్పేస్‌వాక్‌లో రికార్డు
జనవరి 16న సునీత, విల్మోర్‌తో కలిసి ఐఎస్‌ఎస్ వెలుపల ఐదున్నర గంటలు స్పేస్ వాక్ చేశారు. పలు కీలక మరమ్మతులు నిర్వహించారు. ఐఎస్‌ఎస్‌కు పలు పరికరాలను అమర్చారు. నాసా యాంటెన్నాను వెనక్కి తెచ్చారు. అంతరిక్ష కేంద్రంలోని కొన్ని భాగాల నుంచి నమూనాలను సేకరించారు.
అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా వృద్ధి చెందుతున్నాయా అన్నది పరిశీలించారు. నైసర్ ఎక్స్-రే టెలిస్కోపుకు కాంతి ఫిల్టర్లను అమర్చారు కూడా. మొత్తం మీద 9సార్లు స్పేస్‌వాక్ నిర్వహించారు సునీత. తద్వారా సుదీర్ఘకాలం స్పేస్‌వాక్‌లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్.