E-Paper
Advertisement

Ghaziabad suitcase Murder: అద్దె చిచ్చు.. ఇంటి యజమానురాలిని చంపిన దంపతులు, మృతదేహాన్ని ముక్కలు చేసి

Ghaziabad suitcase Murder:  అద్దె చిచ్చు.. ఇంటి యజమానురాలిని చంపిన దంపతులు, మృతదేహాన్ని ముక్కలు చేసి
Advertisement

Ghaziabad suitcase Murder: ఇంట్లో అద్దెకు ఉన్నవారితో జాగ్రత్త. వారి ఆగ్రహానికి గురైతే చంపేయడం ఖాయం. ఆ తరహా ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అద్దె విషయంలో యజయమానురాలితో ఆ దంపతులు గొడవపడ్డారు. పట్టరాని కోపంతో భార్యభర్తలు ఆమెని చంపేశారు. మృతదేహాన్నిముక్కలుగా చేసి సూట్ కేట్‌లో ప్యాక్ చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.

అద్దె వ్యవహారం.. ఇంటి యజమానురాలిని చంపిన దంపతులు

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ప్రాంతంలోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఘాజియాబాద్‌లో నివాసం ఉంటోంది దీపికాశర్మ ఫ్యామిలీ. వారికి రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో మరొక ఫ్లాట్ ఉంది. దాన్ని అద్దెకు ఇచ్చారు. అద్దెకున్న ఆ దంపతులు యజమానికి దాదాపు 90 వేలు వరకు బకాయిపడ్డారు. ఎప్పుడు డబ్బులు అడిగినా అదిగో, ఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు.

తాడో పేడో తేల్చుకునేందుకు దీపికాశర్మ, అద్దెకి ఇచ్చిన ఫ్లాట్‌కి బుధవారం సాయంత్రం వెళ్లింది. గతంలో రెండు లేదా మూడుసార్లు అక్కడికి వెళ్లినప్పుడు తనతో ఇంట్లోని పని మనిషిని తీసుకుని వెళ్లేది. ఈసారి ఆమె ఒంటరిగా వెళ్లింది. అద్దె విషయంలో యజమానిరాలితో ఆ దంపతులు గొడవ పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ ఇంటి ఓనర్‌ని చంపేశారు ఆ దంపతులు.

Advertisement

శరీరాన్ని ముక్కలు చేసి సూట్‌కేటులో ప్యాక్

తొలుత దీపికా తలపై ప్రెషర్ కుక్కర్‌తో బలంగా కొట్టారు. స్పృహం కోల్పోయిన తర్వాత గొంతు కోసి చంపారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో ప్యాక్ చేశారు. ఆ సూట్‌కేస్‌ను ఏకాంత ప్రదేశంలో పడేయాలని ఆ జంట డిసైడ్ అయ్యింది.  ఈలోగా దీపికా పని మనిషి అద్దె ఇంటికి వచ్చింది. యజమాని ఆచూకీ గురించి పదే పదే ప్రశ్నించినా చెప్పలేదు. పని మనిషికి అనుమానం వచ్చింది.

ALSO READ:  పెళ్లిలో 1000 మంది గెస్టులు.. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు

ఆ జంటను ఉన్న ఫ్లాట్‌లో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, మంచం కింద దాచిన సూట్‌కేస్ ని గుర్తించారు. అందులో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ జంటను అరెస్టు చేశారు. అద్దె చెల్లిస్తామని చెప్పి తన కుమార్తెకు ఫోన్ చేసి ఫ్లాట్‌కి రప్పించారని మృతురాలి పోలీసులకు చెప్పింది. పక్కా ప్లాన్ ప్రకారం తన కూతుర్ని హత్య చేశారని కన్నీరుమున్నీరు అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దంపతులను విచారిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×