E-Paper
Advertisement

Fire wedding Reception: పెళ్లిలో 1000 మంది గెస్టులు.. ఇంతలో ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, చివరికి..

Fire wedding Reception: పెళ్లిలో 1000 మంది గెస్టులు.. ఇంతలో ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, చివరికి..
Advertisement

Fire wedding Reception: చలికాలంలో అగ్నిప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. అందుకు రకరకాల కారణాలు కావచ్చు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకుంటే గ్యాస్ సిలెండర్ వల్ల కావచ్చు.  కాకపోతే వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుండగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సమయంలో వేదిక వద్ద వెయ్యి నుంచి 1200 అతిధులు ఉన్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఎగిసిపడిన మంటలు

Advertisement

మహారాష్ట్రలోని వెస్ట్ థానే ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్లూ రూఫ్ క్లబ్‌లో గురువారం రాత్రి ఓ వివాహానికి సంబంధించి రిసెప్షన్ జరుగుతోంది. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే ఆ ఫంక్షన్ హాలు అంతా మంటల్లో మాడి మసైంది. ఘటన సమయంలో రిసెప్షన్‌ కోసం దాదాపు వెయ్యి నుంచి 1200 మంది వరకు అతిథులు హాజరయ్యారు. మంటలు క్రమంగా వ్యాపించడంతో వారంతా ఫంక్షన్ హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో అతిథులంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఘటన సమయంలో 1000 మంది గెస్టులు

రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ కొన్ని విషయాలు బయట పెట్టారు. ది బ్లూ రూఫ్ క్లబ్ పక్కనున్న క్యాబిన్‌లో మండపం అలంకరణ సామాగ్రికి తొలుత మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో వేదిక వద్ద వివాహ రిసెప్షన్ జరుగుతోందని అన్నారు.

అతిథులు వేదిక వద్ద గుమ్మిగూడారని తెలిపారు. ప్రమాదం గమనించిన వెంటనే అతిథులను సురక్షితంగా వేదిక నుండి తరలించినట్టు తెలిపారు. సకాలంలో అందరూ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. దాదాపు నాలుగైదు గంటల శ్రమించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది.

ALSO READ: కట్టుకున్న భార్యని కడతేర్చిన భర్త.. గద్వాల జిల్లాలో దారుణం

అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి వుందన్నారు. సరదా జరగాల్సిన వేడుక కాస్త విషాదంగా మారింది. అమ్మాయి అత్తింటికి వస్తున్న వేళ సరిగా లేదని, అందువల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అమ్మాయి అదృష్టం వల్లే అతిధులంతా క్షేమంగా బయటపడ్డారని అంటున్నవాళ్లు లేకపోలేదు. కానీ పెళ్లింటివాళ్లకు మాత్రం సెంటిమెంట్ వెంటాడుతోంది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×