BigTV English

ConMan Arrested : బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..

ConMan Arrested : బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..

ConMan Arrested After 20 Years| 20 ఏళ్ల క్రితం బ్యాంకులో దొంగతనం చేసి పారిపోయిన ఓ దొంగను అందరూ చనిపోయాడనుకున్నాడు. కానీ విధి అతడిని పోలీసులకు పట్టించింది. ఇది ఒక అరుదైన కేసుగా స్వయంగా సిబిఐ పోలీసులే చెబుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన వి చలపతి రావు అనే వ్యక్తి 2004లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కంప్యూటర్ ఆపరేటర్ గా చిన్న ఉద్యోగం చేసేవాడు. అయితే దురాశపరుడైన చలపతిరావు. బ్యాంకు నుంచి రూ.50 లక్షలు దొంగతనం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను దొంగతనం చేయలేదని చలపతిరావు కొంతకాలం వరకు పోలీసులకు నమ్మించగలిగాడు. బ్యాంకులో దొంగతనం కేసులో చలపతిరావుకు అతని భార్య సహాయం చేసిందని పోలీసుల విచారణలో తేలింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. చలపతిరావు రాత్రికి రాత్రే హైదరాబాద్ వదిలి పారిపోయాడు.

Also Read: డేటింగ్ యాప్ లవ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడు ఏం చేశాడంటే..


ఈ కేసులో పోలీసులు డిసెంబర్ 31, 2004లో రెండు చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. చలపతిరావు కోసం ఎంత వెతికినా పోలీసులకు అతని ఆచూకీ తెలియలేదు. కారణం చలపతిరావు ప్రతి నెలా, రెండు నెలలకు తాను ఉంటున్న ఊరిని వదిలి మరో ప్రదేశానికి వెళ్లిపోయేవాడు. అలా ఏడేళ్లు గడిచిపోయాక చలపతిరావు భార్య హైదరాబాద్ సివిల్ కోర్టులో తన భర్త చనిపోయాడని కేసు వేసింది. చట్ట ప్రకారం.. ఒక వ్యక్తి ఏడేళ్లుగా కనపడకపోతే అతను మరణించినట్లు కోర్టు ప్రకటిస్తుంది. కోర్టు చలపతిరావు భార్య పిటీషన్ లో ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. చలపతిరావు చనిపోయనట్లుగా ప్రకటిచింది.

మరో వైపు 2007లో చలపతిరావు తమిళనాడులోని సలెం అనే ఓ చిన్న గ్రామంలో మరో మహిళను వివాహం చేసుకొని స్థానికంగా ఒక చిన్న ఉద్యోగం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా తన పేరుని వినీత్ కుమార్ అని మార్చుకన్నాడు. వీనీత్ కుమార్ అనే పేరుతో ఆధార్ కార్డ్ కూడా తీసుకున్నాడు. 2014లో ఈ కేసు సిబిఐ చెంతకు చేరింది. సిబిఐ అధికారులు చలపతిరావును పట్టుకునేందుకు అతని భార్య ఫోన్ ని ట్యాప్ చేశారు. అప్పుడే తెలసింది. చలపతిరావు వారంలో రెండు రోజులు తమిళనాడు నుంచి తన మొదటి భార్య కు ఫోన్ చేస్తున్నాడని. సిబిఐ అధికారులు చలపతిరావు భార్య ఫోన్ ట్రేస్ చేసి సలెం గ్రామానికి చేరుకున్నారు.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

కానీ జిత్తుల మారి చలపతిరావు పోలీసుల రాకను పసిగట్టి మళ్లీ తప్పించుకున్నాడు. ఆ తరువాత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో స్థిరపడ్డాడు. అక్కడ ఒక లోన్ రికవరీ ఏజెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. కొంతకాలం పనిచేసిన తరువాత అక్కడ కొత్త స్నేహితుల ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మకాం మార్చాడు. అక్కడ రుద్రపూర్ అనే ప్రాంతంలోని ఒక స్కూల్ లో దాదాపు రెండేళ్ల పనిచేశాడు. అయితే సిబిఐ అధికారులు అతడిని వెతుక్కుంటూ రుద్రపూర్ చేరుకున్నారు. కానీ చలపతిరావు మళ్లీ పారిపోయి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఓ ఆశ్రమంలో సన్యాసిగా మారిపోయాడు. ఈ సారి తన పేరుని విధితామానంద తీర్ధ స్వామి అని మార్చుకున్నాడు. ఈ పేరుతో ఆధార్ కార్డ్ కూడా చేసుకున్నాడు.

2021లో ఔరంగాబాద్ ఆశ్రమం నుంచి రూ.70 లక్షలు చోరీ చేసి రాజస్థాన్ లోని భరత్ పూర్ పారిపోయాడు. అక్కడ కొంతమందిని శిష్యులగా చేసుకొని పెద్ద స్వామీజీగా చెలామణి అయ్యాడు. ఆ తరువాత ఒక శిష్యుడితో కలిసి తిరిగి తమిళనాడు చేరుకున్నాడు. తమిళనాడులోని తిరనేళ్ వెలి సమీపంలో నరసింగనల్లూర్ గ్రామంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సిబిఐ అధికారులు.. పట్టువదలకుండా చలపతిరావు కోసం వెతికారు. చిట్టచివరికి ఆగస్టు 4, 2024న రసింగనల్లూర్ గ్రామం చేరుకొని చలపతిరావు మెడను పట్టుకున్నారు. ఆ తరువాత అతనిపై దొంగతనం, మోసం, కేసులు నమోదు చేసి.. హైదరాబాద్ కోర్టులో హాజరపరిచారు. ప్రస్తుతం కోర్టు అతడిని రిమాండ్ కు పంపింది.

Also Read:  మేనత్త ఇంట్లోనే దోపిడీ చేయించిన కేడి లేడీ.. గతంలో హనీట్రాప్ కూడా!

Related News

Delhi Triple Murder: ఢిల్లీలో ఘోరం.. ఓ ఫ్యామిలీలో ముగ్గురు దారుణ హత్య, నిందితుడు కుటుంబసభ్యుడే?

Hydrabad News: మియాపూర్‌లో దారుణం.. ఐదుగురు వ్యక్తులు సూసైడ్, ఏం కష్టమొచ్చింది?

Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి

Hyderabad News: దారుణం.. భర్తతో గొడవ పెట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?

Gadwal Tragedy: విషాదం.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూల్ బస్సు

Big Stories

×