Pakistan Divorce Party| పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో మత సంప్రదాయాలు కఠినంగా ఆచరిస్తారు. మహిళలు చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకోకూడదు, వీలైనంతగా బుర్కా ధరించాలి. విచ్చలవిడిగా తిరగకూడదు. ముఖ్యంగా ఇంట్లో భర్త, తండ్రి చెప్పినట్లు తప్పకుండా వినాల్సిందే. ఆఫ్ఘనిస్థాన్ లో అయితే ఇలాంటి సంప్రదాయాలను ఉల్లంఘిస్తే.. కొరడా దెబ్బలు, మరణ శిక్ష వరకు విధిస్తారు. పాకిస్తాన్ లో మరి అంత కఠినం కాకపోయినా.. అక్కడ తీవ్ర విమర్శలైతే ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ లో అలాంటిదే ఒక ఘటన జరిగింది.
ఒక మహిళ తన భర్త నుంచి విడాకులు పొందినందుకు సంతోషంతో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. సాధారణంగా పెళ్లి వేడుకలో శుభాకాంక్షలు తెలుపుతూ.. ముస్లింలు షాదీ ముబారక్ అని అంటారు. అలాంటిది ఈ నయా జమానా వనిత.. డైవోర్స్ ముబారక్ (విడాకుల శుభాకాంక్షలు) అని థీమ్ తో పార్టీ చేసుకుంది.
పార్టీ చేసుకోవడమే మామూలుగా కాదు.. అందరి ముందు బాలీవుడ్ సినిమాల పాటలకు చిందులు వేసింది. హిందీ పాట ‘జోర్ కా ఝట్కా’. ‘బారిష్ కర్దూ పైసేకీ’ పాటలకు మంచి ఎక్సెప్రెషెన్స్ తో తన సంతోషానికి హద్దులు లేవని తెలుపుతూ డాన్సు చేసింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
అయితే ఈ నేటి తరం నారీ గురించి పాకిస్తాన్ వార్తా సంస్థ న్యూస్ మినట్ ఒక కథనం రాసింది. ఈ కథనం ప్రకారం.. ఈమె పాకిస్థానీ అయినప్పటికీ.. అమెరికాలో స్థిరపడిందని.. అక్కడ ఒక ఫ్యాషన్ డ్రెస్ షాపు నడుపుకుంటోందని తెలిసింది.
ఈ మహిళ వీడియోపై నెటిజెన్లు చాలా కామెంట్లు చేస్తున్నారు. ఒకరు సోషల్ మీడియా వల్ల సమాజం నాశనం అవుతూందని రాస్తే.. మరొకరు కలియుగం అంటే ఇదే.. అని రాశారు. అయితే ఒక యూజర్ మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తూ.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మనకు పూర్తిగా తెలియదు కదా.. ఆమె భర్త వల్ల నరకం చూసిందేమో.. ఇప్పుడు విడాకులు రాగానే ఆనందంగా చిందులేస్తోంది.. అని రాశారు.
Social Media has done great damage to the Institution of Marriage pic.twitter.com/jQSC5bnyWb
— Professor Sahab (@ProfesorSahab) July 25, 2024
Also Read: నీటిపై తేలియాడుతూ ఎప్పుడైనా డిన్నర్ చేశారా?.. ప్రపంచంలో టాప్ టెన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవే..