BigTV English

Girl Kills Own Brother: ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!

Girl Kills Own Brother: ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!

Girl Kills Brother Over dispute about Phone Calls: స్మార్ట్ ఫోన్ ను అవసరానికి మించి వాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఫోన్ తో పనిలేకున్నా.. దానికే అంటుకుపోయి ఉంటున్నారు. గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడటం, సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఫోన్ల మోజులో పడి మనుషుల విలువ తెలుసుకోవడం లేదు. అబ్బాయిలతో మొబైల్ ఫోన్ లో మాట్లాడిన బాలికను మందలించినందుకు.. తన అన్ననే అంతమొందించింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని ఖైరాఘర్ – చుయిఖదాన్-గండాయ్ జిల్లాలో జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుయిఖదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్లిదిహ్కల గ్రామంలో.. బాలిక తరచూ ఫోన్ లో అబ్బాయిలతో మాట్లాడటాన్ని తన అన్నయ్య గ్రహించాడు. ఫోన్ లో ఎక్కువ మాట్లాడొద్దని మందలించాడు. దాంతో.. కోపానికి గురైన యువతి అతను నిద్రిస్తుండగా గొడ్డలితో అతని గొంతుపై వేటు వేసింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read: నర్సు కాదు ఓ కిల్లర్.. 700 ఏళ్ల జైలు


అనంతరం బాలిక స్నానం చేసి.. తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి, తన సోదరుడు హత్యకు గురయ్యాడని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులను విచారించగా ఆ సమయంలో తాము బయట ఉన్నామని తెలిపారు. బాలిక ప్రవర్తనను అనుమానించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. తానే హత్యచేసినట్లు అంగీకరించింది. బాలికపై కేసు నమోదు చేసి.. జువైనల్ హోమ్ కు తరలించారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×