Big Stories

RCB Vs GT Highlights: ఆర్సీబీ జైత్రయాత్ర.. గుజరాత్ పై ఘన విజయం!

IPL 52nd Match – Royal Challengers Bengaluru Vs Gujarat Titans Highlights: ఐపీఎల్ సీజన్ 2024లో మ్యాచ్ లను చూస్తే ఇది కలా? నిజమా? అనిపిస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. నిన్నటి వరకు అట్టడుగు 10వ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మరో విజయం సాధించింది. గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో ఆ జట్టుని ఓడించి, పాయింట్ల పట్టికలో ఏకంగా 7వ స్థానంలోకి ఎగబాకింది. అంతేకాదు ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది.

- Advertisement -

టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. తర్వాత లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 13.4  ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించి విజయ పతాకం ఎగురవేసింది.

- Advertisement -

148 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఒకదశలో చూస్తే  ఓపెనర్లు ఇద్దరూ మ్యాచ్ గెలిపిస్తారని అంతా అనుకున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.  కేవలం 23 బంతుల్లో 3 సిక్స్ లు, 10 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: ముంబై వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ విశేషాలు ఎన్నో.. 12 ఏళ్ల తర్వాత..!

ఇలా తొలివికెట్ 5.5 ఓవర్లలో 91 పరుగుల వద్ద పడింది. కానీ ఇక్కడ గుజరాత్ బౌలర్లు మాయ చేశారు. ఒక్కసారి పట్టు బిగించారు. దీంతో 99 పరుగుల వద్ద 2 వ వికెట్ పడింది. ఇంక ఆ మాయ ఆగలేదు. ఏం జరుగుతుందో తెలిసేసరికి 103 పరుగుల వద్ద 3వ వికెట్, 107 దగ్గర 4 వ వికెట్, 111 దగ్గర 5వ వికెట్ 117 దగ్గర  6 వ వికెట్ ఇలా ఫటాఫటామని పడిపోయాయి. అంతా ఏం  జరుగుతుందో అనుకున్నారు.

చివరికి దినేష్ కార్తీక్ (21), స్వప్నిల్ సింగ్ (15) ఇద్దరూ నాటౌట్ గా ఉండి ఆర్సీబీని గట్టెక్కించారు. మొత్తానికి  గుజరాత్ బౌలర్లు వణికించారు. ఇకపోతే ఓపెనర్ గా వచ్చిన విరాట్ కొహ్లీ 27 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు.

విల్ జాక్స్ (1),  రజత్ పటీదార్ (2), మాక్స్ వెల్ (4), కెమరాన్ గ్రీన్ (1) ఫటాఫట్ బ్యాట్ ఎత్తి సీరియస్ గా డగౌట్ కి వెళ్లి కూర్చున్నారు. మొత్తానికి మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఒక్కసారి పైకి లేచింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Also Read: IPL 54th Match PBKS vs CSK: తిప్పేసిన జడేజా.. చెన్నైతో పోరులో పంజాబ్ చిత్తు..

గుజరాత్ బౌలింగులో జోష్వా లిటిల్ 4, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్లు వ్రద్ధిమాన్ సాహ(1), కెప్టెన్ శుభ్ మన్ గిల్ (2) వెంట వెంటనే అయిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన సాయి సుదర్శన్ (6) త్వరగా అయిపోయాడు. దీంతో గుజరాత్ 5.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 19 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాటియా (35), రషీద్ ఖాన్ (18), విజయ్ శంకర్ (10) అలా మురిపించి అయిపోయారు. ఎవరో ఒకరు స్టాండర్డ్ గా ఉండి ఉంటే కొంచెం మంచి స్కోరు వచ్చేది.  కానీ అలా జరగకపోవడంతో 147 పరుగుల వద్ద గుజరాత్ కథ ముగిసిపోయింది.

ఆర్సీబీ  బౌలింగులో సిరాజ్ మెరిశాడు. పవర్ ప్లేలో 2 వికెట్లు తీశాడు. యశ్ దయాల్ 2, విజయ్ కుమార్ 2, కర్ణ శర్మ 1, గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News