E-Paper
Advertisement

Crime News: పహాడీ షరీఫ్‌లో అమానుషం, ప్లాస్టిక్ కార్ఖానాలో బాలికపై అత్యాచారం

Crime News: పహాడీ షరీఫ్‌లో అమానుషం, ప్లాస్టిక్ కార్ఖానాలో బాలికపై అత్యాచారం
Advertisement

Hyderabad News: హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నిందితులు బాలిక కిడ్నాప్‌కు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం… ఈ నెల 12న బాధిత బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు మరుసటి రోజు, 13న పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

దర్యాప్తులో భాగంగా.. బాలికను జల్‌పల్లి ప్రాంతంలోని ఒక ప్లాస్టిక్ కార్ఖానాలో బంధించినట్లు.. అక్కడ ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఈ దారుణానికి పాల్పడింది ఒక మైనర్ బాలుడు అని నిర్ధారించారు. అతడికి ఈ నేరంలో మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు.

Also Read: విషాదం.. రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..

Advertisement

బాధితురాలి ఫిర్యాదు, దర్యాప్తు వివరాల ఆధారంగా.. పహాడీ షరీఫ్ పోలీసులు తక్షణమే స్పందించి, మైనర్ బాలుడు సహా మొత్తం ముగ్గురిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక సాక్ష్యం.. అయిన వైద్య పరీక్షల నిమిత్తం బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×