E-Paper
Advertisement

UPI Safety Tips: యూపీఐ ద్వారా డబ్బు పంపించే ముందు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!

UPI Safety Tips: యూపీఐ ద్వారా డబ్బు పంపించే ముందు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!
Advertisement

UPI Safety Tips: నేటి ఆధునిక యుగంలో UPI ద్వారా ఆర్థిల లావాదేవీలు జరపడం అనేది అందరికీ అలవాటైపోయింది. మొబైల్‌లో కొన్ని క్లిక్స్‌తోనే చెల్లింపులు పూర్తవుతున్నాయి. అయితే, ఈ సౌలభ్యంతో పాటు ప్రమాదాలు కూడా పెరిగాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ విస్తరిస్తున్న కొద్దీ మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యమే మీ ఖాతాలోని డబ్బు క్షణాల్లో పోయే పరిస్థితి తీసుకురాగలదు. అందుకే UPI వాడేటప్పుడు మౌలిక భద్రతా నియమాలు తెలుసుకుని, ప్రతి లావాదేవీలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

క్షణాల్లో ఖాతా ఖాళీ:

ప్రస్తుతానికి దేశంలో డిజిటల్ పేమెంట్స్ వేగంగా పెరుగుతున్నప్పటికీ, సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కేవలం కొన్ని క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాల నుంచి లక్షల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు. కాబట్టి.. యూపీఐ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకూడదు.

Advertisement

Also Read: ఏడాదిపాటు ఉచితంగా అడోబ్‌ ఫొటోషాప్‌.. డౌన్లోడ్ చేసుకోకుండానే ఆన్‌లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు!

వేర్వేరు ఖాతాలు ఉండాలి:

సైబర్ కేటుగాళ్ల నుంచి రక్షణ పొందాలంటే.. UPI అకౌంట్‌ను ప్రధాన సేవింగ్స్ అకౌంట్ నుంచి నుండి వేరు చేయడం చాలా ముఖ్యం. అంటే.. UPIతో లింక్ చేసిన ఖాతాలో పరిమిత మొత్తాన్ని మాత్రమే ఉంచడం వల్ల ఏదైనా అనూహ్య లావాదేవి జరిగినా కొంతవరకే నష్టపోతాం. ప్రస్తుతం పలు బ్యాంకులు యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేసే ఫీచర్లను అందిస్తాయి. అలాంటి వాటిని సెట్ చేసుకోవడం వల్ల భద్రత లభిస్తుంది.

క్షుణ్ణంగా పరిశీలించాలి:

Advertisement

UPI ద్వారా డబ్బు పంపే ముందు.. రిసీవర్ పేరును ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం అత్యంత అవసరం. దీని కోసం QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత స్క్రీన్‌లో కనిపించే సమాచారం పూర్తిగా చదవండి. సైబర్ నేరగాళ్లు తరచుగా తక్షణ చెల్లింపు అనే సందేశాలను పంపుతుంటారు. ఇలాంటి మోసాలను ముందుగా గమనించకపోతే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి.. మీకు వచ్చిన QR కోడ్ స్కానర్ నిజమైనదో, లైదో తనిఖీ చేయాలి.

పిన్ ఎంటర్‌లో అజాగ్రత్త వద్దు:

ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌ను రిపేర్ లేదా సర్వీస్ కోసం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. ఒకసారి పిన్ లీక్ అయితే.. ఖాతా క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే యూపీఐ పిన్ ఎంటర్ చేసే సమయంలో కూడా చుట్టూ ఎవరూ చూస్తున్నారా అని గమనించండి. అంతేకాదు.. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, అనుకోని వెబ్‌సైట్లలో పాస్వర్డ్ నమోదు చేయడం వంటి పనులను మానుకోవడం ఉత్తమం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. UPI ద్వారా జరిపే ప్రతి లావాదేవీ సురక్షితంగా ఉంటుంది.

Also Read: 2025లో గూగుల్‌ను షేక్ చేసిన టాప్ సెర్చ్‌లు ఇవే!.. ఇంతకీ మీరేం వెతికారో గుర్తుందా?

Related News

బడ్జెట్‌లో HP కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ పాంథర్ లేక్ ప్రాసెసర్‌తో అదిరే స్పెసిఫికేషన్స్!

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?

7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!

ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

Big Stories

Advertisement
×