E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో ఫేక్ గోల్డ్ కలకలం

ఖమ్మం జిల్లాలో ఫేక్ గోల్డ్ కలకలం
Advertisement

Gold Loan Scam: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఏన్కూర్ శాఖలో 2024 సంవత్సరంలో జరిగిన గోల్డ్ లోన్ మోసం కేసులో సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి మొత్తం రూ. 9,53,000లు మోసగించి గోల్డ్ లోన్లు పొందినట్లు విచారణలో నిర్ధారించారు. కాగా లోన్లు చెల్లించకపోవ డంతో ఎన్. పీ.ఏ. ఖాతాలుగా మారి బ్యాంకు వారు నిర్వహించిన వేలంలో ఆభరణాలు నకిలీవని గుర్తించారు.

పరారీలో ఉన్న..

ఐతే ఈ నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు ఇప్పటికే అరెస్టు కాగా పరారీలో ఉన్న ఏ2 శ్రీపాది మౌనికను బుధవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడికి రిమాండ్ కుతరలించామని కల్లూరు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులు శ్రీపాది సతీష్ , రామచంద్రోజు జయమ్మ , రామచంద్రోజు నరేష్ తదితరులపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏన్కూర్ శాఖ బ్రాంచ్ మేనేజర్ కె.వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also read: కేంద్ర ప్రభుత్వం పై.. ఎంపీ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు

గతంలో ఏన్కూర్‌లో..

దర్యాప్తులో భాగంగా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శ్రీపాది సతీష్ (A1) ఆయన భార్య శ్రీపాది మౌనిక (A2), సతీష్ అత్త రామచంద్రోజు జయమ్మ (A3), సతీష్ బావమరిది రామచంద్రోజు నరేష్ (A4) లతో దర్యాప్తునిర్వహించారు. గతంలో ఏన్కూర్ లో శ్రీపాది సతీష్ రామచంద్రోజు నరేష్ లు కలిసి “మౌనిక జ్యువలరీ షాప్” పేరుతో వ్యాపారం చేశారని ప్రజలను మోసం చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. అందిన ఇతర ఫిర్యాదుల పై కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో దారుణం.. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినిపై అత్యాచారం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×