Road Accident: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఐదుమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదవశాత్తు ఎలాంటి మరణాలు లేవు.. అయితే వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి..
అయితే వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు రహదారిపై ముందుగా ఒక ఆటో, ఒక బైక్ సాధారణ వేగంతో వెళ్తున్నాయి. అకస్మాత్తుగా వెనుక నుండి మరో ఆటో అతివేగంగా వచ్చి, ముందు ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ వేగంతో రెండు ఆటోలు, బైక్ బోల్తా పడ్డాయి.. వెమ్మటే అక్కడి స్థానికులు స్పందించి గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also Read: సుప్రీంపై సర్కారు ఆశలు.. రిజర్వేషన్లపై రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తాయా!
ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో రెండు ఆటోల డ్రైవర్లు, ముందు ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, బైక్ రైడర్ ఉన్నారు. వీరికి ప్రాథమిక వైద్య సహాయం అందించిన తర్వాత, వారి పరిస్థితి నిలకడగా ఉందని, కానీ కొందరికి ఫ్రాక్చర్లు, తల గాయాలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అతివేగంగా డ్రైవ్ చేసిన ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ రహదారి జాతీయ హైవే కావడంతో, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
చూస్తుండగానే ఘోర రోడ్డు ప్రమాదం..
అతివేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న ఆటోను బైక్ ను ఢీ కొట్టి బోల్తా కొట్టిన మరో ఆటో
వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఘటన
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహన దారుడికి తీవ్ర… pic.twitter.com/UBjhTMLhnt
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025