Kriti Sanon: ఈమధ్య కాలంలో హీరోయిన్లు సినిమాల ద్వారానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా మెరుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాల తరఫున పనిచేస్తూ తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. దీపికా పదుకొనే (Deepika Padukone) మొదలుకొని రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన వరకు ఇలా ఎంతోమంది ప్రభుత్వాల కోసం పనిచేస్తూ అటు సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఇటు ఈ బాధ్యతల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్టేజ్ పై తొలి భారతీయ నటిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రభాస్ (Prabhas)బ్యూటీ కృతి సనన్(Kriti Sanon)..
విషయంలోకి వెళ్తే.. బెర్లిన్ లో నిర్వహించిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ – 2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతి సనన్ నిలిచింది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ..” మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది . ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ వారి వైద్యానికి సరిపడిన నిధులు ఉండడం లేదు. మహిళల ఆరోగ్యంతో పాటు లింగ సమానత్వం కోసం కూడా అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మహిళల ఆరోగ్యం అనేది అంత తేలికగా తీసుకునే అంశం కాదు. మానవాళి భవిష్యత్తుకు మూల స్తంభం లాంటిది” అంటూ కృతి సనన్ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కూడా ఈమెకు అరుదైన గౌరవం లభించింది..
ఇకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి సనన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆమె ఇలా ప్రసంగించి మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ALSO READ:HBD Prithvi Raj Sukumaran: గాయకుడి నుండి నటుడిగా, దర్శకుడిగా.. పృథ్వీరాజ్ ఆస్తులు ఎన్ని కోట్లంటే?
కృతి సనన్ సినిమాలు..
కోలీవుడ్ స్టార్ హీరో కం డైరెక్టర్ ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమ కథ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే షాహిద్ కపూర్ తో కలిసి ‘కాక్ టెయిల్ 2’ అనే సినిమాలో కూడా నటిస్తోంది . ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఈమె తెలుగులో నటించిన చిత్రాల విషయానికొస్తే .. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆది పురుష్’ సినిమాలో సీత పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాస గాధగా తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నా.. కథను తెరపై చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యారనే వార్తలు వినిపించడం ద్వారా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==