HBD Prithvi Raj Sukumaran:పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithvi Raj Sukumaran).. విలక్షణ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. మలయాళం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ మూవీలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా వరదరాజు మన్నార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న పృథ్వీరాజ్ సలార్ తర్వాత ‘ఆడు జీవితం’ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
తెలుగులో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న సలార్ 2 లో నటించనున్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా తనకంటూ ఒక పేరు దక్కించుకున్న ఈయన.. దర్శకుడిగా కూడా పలు చిత్రాలకు వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు ఎంత కూడబెట్టారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.మరి అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ALSO READ:Prashanth Neel: KGF-3కి సర్వం సిద్ధం.. ఫైనల్ బ్లాస్ట్ కి సిద్ధం కండంటూ!
పృథ్వీరాజ్ సుకుమారన్..2002లో నందనం అనే సినిమాతో నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2006లో మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన క్లాస్మేట్స్ సినిమాతో హీరోగా అవతరించారు. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాలలో నటించిన ఈయన.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 100కు పైగా చిత్రాలలో నటించి పేరు దక్కించుకున్నారు. తిరువనంతపురంలో జన్మించిన ఈయన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి నటనను కొనసాగించడానికి చదువును మధ్యలోనే వదిలేశాడు.అలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన సెల్యులాయిడ్, అయ్యప్పనుమ్ కోషియుమ్, కోల్డ్ కేస్, కురుతి, బ్రహ్మం, జనగణమన వంటి చిత్రాలతో మంచి విజయం అందుకున్నారు.
ఈయన ఆస్తుల విషయానికొస్తే.. సుమారుగా రూ.80 కోట్ల వరకు కూడబెట్టినట్లు సమాచారం. నటుడు గానే కాకుండా సింగర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఈయన ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 2018లో ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన పృథ్వీరాజ్.. కేరళలోని కొచ్చిలో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అలాగే ముంబైలోని బాంద్రాలో పాలీహిల్ ఏరియాలో 17 కోట్ల విలువైన పారిశ్రమ్ లో ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు.
పృథ్వీరాజ్ దగ్గర ఉన్న కార్ కలెక్షన్ విషయానికొస్తే.. లంబోర్గిని ఉరస్, మెర్సిడెస్ AMG G 63, రేంజ్ రోవర్ వోగ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 పోర్షే వంటి విలాసవంతమైన కార్లు ఈయన సొంతం. ఇకపోతే ఈరోజు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.