BigTV English

NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం

NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక అద్భుతమైన పథకం. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) పరీక్ష 2025-26 కోసం రిజిస్ట్రేషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 18 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చని ప్రకటన విడుదల చేసింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 22 లోపు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల ముద్రిత కాపీలు, నామినల్ రోల్స్ (టూ కాపీలు), ఫీజు రిసీప్ట్ లను సంబంధిత జిల్లా విద్యా అధికారి (DEO)కి సమర్పించాలి. డీఈఓలు ధ్రువీకరించిన సర్టిఫికెట్లను అక్టోబర్ 24 లోపు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది.


ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ప్రతి నెలా రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 ఉపకార వేతనం అందుతోంది. నాలుగు సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.48,000 ఆర్థిక సహాయం విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.

⦿ NMMS స్కాలర్‌షిప్ పొందడానికి విద్యార్థులు పలు అర్హతలను కలిగి ఉండాలి. విద్యార్థి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ స్కాలర్ షిప్ స్కీంకు అర్హులు అవుతారు. ఏడో తరగతి ఫైనల్ పరీక్షల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు సరిపోతాయి.


⦿ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం (Annual Family Income) రూ.3,50,000 మించకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరే ఇతర స్కాలర్‌షిప్ పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులు దీనికి అనర్హులు అవుతారు.

⦿ విద్యార్థుల ఎంపిక ఒక రాష్ట్ర స్థాయి రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి

⦿ Mental Ability Test – మెంటల్ ఎబిలిటీ టెస్ట్): ఇందులో రీజనింగ్, లాజికల్ థింకింగ్ కు సంబంధించిన 90 ప్రశ్నలు ఉంటాయి.

⦿ Aptitude Test – ఆప్టిట్యూడ్ టెస్ట్: ఇందులో 7వ, 8వ తరగతి పాఠ్యాంశాల (సైన్స్, సోషల్, మ్యాథ్స్) ఆధారంగా 90 ప్రశ్నలు ఉంటాయి.

⦿ ప్రతి పేపర్‌కు 90 నిమిషాల సమయం ఉంటుంది. ఈ రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

⦿ ముఖ్యమైన డేట్స్..

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 18

ఎగ్జామ్ తేది: నవంబర్ 23

⦿అప్లికేషన్: విద్యార్థులు చదువుతున్న స్కూల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

⦿ విద్యార్థులు తమ దరఖాస్తులను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా లేదా సంబంధిత రాష్ట్ర విద్యా శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఆఖరి తేదీలోపు మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ALSO READ: Supreme Court: సుప్రీంపై సర్కారు ఆశలు.. రిజర్వేషన్లపై రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తాయా!

Related News

Gold Smuggling: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో.. రూ. రెండున్నర కోట్ల బంగారం సీజ్

Telangana Cabinet: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో..?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఏంటీ బీఆర్ఎస్ లైట్ తీసుకుందా..?

Konda Surekha: భట్టితో మంత్రి కొండా సురేఖ భేటీ.. సెక్యూరిటీ లేకుండానే..?

Shabbir Ali Comments: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్..

Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కేడర్ మద్దతు ఎవరికి?

Telangana News: బీసీ రిజర్వేషన్ల అంశం.. ఎస్ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ, పాత పద్దతిలో ఎన్నికలు?

Big Stories

×