E-Paper
Advertisement

రూ. 2,000 అద్దె కట్టలేక.. భార్య, కూతుర్ని.. ఇంటి ఓనర్‌కు అప్పగించిన భర్త!

రూ. 2,000 అద్దె కట్టలేక.. భార్య, కూతుర్ని.. ఇంటి ఓనర్‌కు అప్పగించిన భర్త!
Advertisement

Gujarat Shocker: సభ్య సమాజం తలదించుకునే ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. కేవలం రూ. 2,000 ఇంటి అద్దె చెల్లించలేకపోయినందుకు.. ఒక వ్యక్తి కన్నకూతురిని, భార్యను ఇంటి యజమాని చేతికి అప్పగించిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. పేదరికం, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జరిగిన ఈ అమానుషం మానవ సంబంధాలలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది.

గుజరాత్ లోని మోర్బీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సురేంద్రనగర్ కు చెందిన బాధిత కుటుంబం.. జీవనోపాధి వెతుక్కుంటూ 6 నెలల క్రితం మోర్బీకి వచ్చింది. రూ. 2000 కిరాయికి ఓ ఇంట్లో అద్దెకు దిగింది. అయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కారణంగా కుటుంబ యజమాని గత 4 నెలలుగా అద్దెను చెల్లించలేకపోయాడు.

Advertisement

దీంతో సహనం కోల్పోయిన ఇంటి ఓనర్.. క్రూరమైన ఆలోచనకు తెరలేపాడు. అద్దెకు బదులుగా కుటుంబ యజమాని భార్య, కూతురిపై కన్నేశాడు. దురదృష్టవశాత్తూ ఆ కుటుంబ యజమాని కూడా ఎదురుతిరగాల్సింది పోయి.. ఇంటి ఓనర్ క్రూరత్వానికి సహకరించాడు. నిందితుడు వారిపై లైంగిక దాడికి పాల్పడుతుంటే మూగప్రేక్షకుడిగా ఉండిపోయాడు.

ఈ దారుణాన్ని భరించలేకపోయిన ఇంటి యజమాని భార్య.. తన తల్లికి జరిగినదంతా చెప్పుకొని వాపోయింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. తమకు జరిగిన అన్యాయాన్ని, తమ సొంత మనిషే తమను ఎలా బలిపశువులను చేశాడో వారు పోలీసులకు వివరించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

Advertisement

Also Read: కూలర్ కావాలా? ఈ ఛాన్స్ అస్సలు వదలకండి.. అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్స్!

ఈ అమానుష ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడైన ఇంటి యజమానితో పాటు.. ఈ దారుణానికి సహకరించిన భర్తపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు.

Also Read: Professor Harassment: ‘పేపర్లు లీక్ చేస్తా డార్లింగ్’.. విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్ అరెస్టు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×