Gujarat Crime: ఈ మధ్యకాలంలో చాలామంది చీటికీ మాటికీ కోపానికి గురవుతున్నారు. ఫలితంగా లేనిపోని అనర్థాలకు దారితీస్తోంది. ఆ సమయంలో ఒక్కోసారి విచక్షణ కోల్పోతున్నారు. ఫలితంగా హత్యకు గురికావడం లేకుంటే చంపేయడం జరుగుతోంది. అలాంటి ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. మరో గంటలో వివాహం జరగాల్సివుండగా, అంతలో పెళ్లి కూతుర్ని హత్య చేశాడు వరుడు. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
గుజరాత్‌లో దారుణం.. మరో గంటలో పెళ్లి
గుజరాత్‌లోని భావ్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లికి గంట ముందు వధూవరుల మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తాయి. ఆగ్రహానికి గురైన వరుడు, కాబోయే భార్యను హత్య చేశాడు. అయినా వివాహానికి ముందు పెళ్లి కొడుకు-పెళ్లి కూతురు ఎదురుపడిన సందర్భం అస్సలు ఉండదు. అలాంటప్పుడు హత్యకు దారితీసిన కారణాలేంటి?
భావ్‌నగర్ ప్రాంతానికి చెందిన సాజన్- సోని రాథోడ్ మధ్య మనసులు కలిశాయి. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ విషయం వాళ్ల కుటుంబాలకు తెలిసింది. వారిని మందలించే ప్రయత్నం చేశారు. సాజన్-సోనీ తట్టుకోలేక పోయారు. దీంతో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో దీంతో ఏడాదిన్నరగా సహజీవనం చేస్తున్నారు.
పెళ్లి కూతుర్ని హత్య చేసిన వరుడు
ఏడాదిన్నర అయినా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేకపోవడంతో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ 15న ముహూర్తం ఫిక్స్ అయ్యింది. పెళ్లి కార్డులు ప్రింట్ చేసి బంధువులు-స్నేహితులకు ఇచ్చారు. ప్రభుదాస్ సరస్సు ప్రాంతంలోని టేక్రీ చౌక్ సమీపంలో వివాహానికి వేదిక నిర్ణయించారు.
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెళ్లికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరిగాయి. సాజన్-సోనీ చక్కగా పార్టిసిపేట్ చేశారు కూడా. అయితే మరో గంటలో వరుడు పెళ్లి చేసుకోవాల్సి వుంది. అంతలోనే పెళ్లి చీర, డబ్బుల విషయంలో వధూవరుల మధ్య గొడవ తలెత్తింది. గాలివానగా మారిడంతో ఆగ్రహానికి గురయ్యాడు వరుడు సాజన్.
ALSO READ: కారు బీభత్సం.. బైక్.. ట్యాంకర్‌ని ఢీకొని దగ్ధమైన వాహనం
పట్టరాని కోపంతో వధువుని ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. అంతేకాదు సోనీ తలను గోడ కేసి గుద్దాడు. వెంటనే వధువు విగతజీవిగా పడిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి అక్కడికి వచ్చినవారు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయాడు వరుడు సాజన్. పెళ్లి పందిరిలో ఇచ్చినవారు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు వచ్చేసరికి సోనీ ఈలోకాన్ని విడిచిపెట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సాజన్‌పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టినట్టు తెలిపారు పోలీసులు. తమ కళ్ల ముందు సోనీ మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారి తల్లిదండ్రులు. కూతుర్ని ఆ విధంగా చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు.