Bride Asks Ganja: కలియుగం అంటే మానవతా విలువలు ఉండవు. సంస్కృతి, సంప్రదాయాలను పాటించడానికి ప్రజలు ఇష్టపడరు. తాజాగా ఒక యువతి చర్యలు గురించి వింటే కలియుగం పీక్స్ లో ఉందా? అని అనుమానం వస్తుంది. తన పెళ్లి జరిగిన రాత్రే ఆ పెళ్లికూతరు తన భర్తతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆ వరుడు సహనం కోల్పోయి తన తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్ వెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివారాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్‌పూర్ నగరంలో ఇటీవల ఒక వివాహం జరిగింది. అది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే వివాహం తరువాత తొలి రాత్రి శోభనం గదిలో పెళ్లికూతురు ఉండగా.. వరుడు అక్కడికి వెళ్లాడు. అక్కడ ఆమె తనకు ఆకలి వేస్తోందని.. కొంచెం బీర్, మటన్ కావాలని తన భర్తను కోరింది. ఇది విని వరుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడామె తనకు అప్పుడప్పుడూ బీర్ తాగడం అలవాటు ఉందని.. తాగే సమయంలో మటన్ ఇష్టంగా తింటానని చెప్పింది. దీంతో ఆ కొత్త పెళ్లికొడుకు తన భార్య కోరిక మేరకు బీర్, మటన్ తేవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్లిన కాసేపటికే అతని ఆమె ఫోన్ చేసి.. తనకు గంజాయి (డ్రగ్స్) తీసుకోవాలనుందని.. వెంటనే తనకు అది కావాల్సిందేని చెప్పింది. ఇది విన్న ఆ పెళ్లికొడుకు ఇదంతా సరదా కోసం చెబుతుందేమోనని భావించాడు.
Also Read: దేశంలో జోరుగా సాగుతున్న రహస్య బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్
కానీ ఆమె చాలా సీరియస్ గా అడిగింది. తనకు వెంటనే కావాలని మళ్లీ మళ్లీ అడిగింది. ఇది విన్న వరుడికి చెమటలు పట్టాయి. గంజాయి తీసుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో.. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి తనకు భార్యగా రావడం అతను ఇష్టపడలేదు. అందుకే వెంటనే వెళ్లి తన తల్లిదండ్రులకు పెళ్లికూతురు గంజాయి, బీర్, మటన్ అడిగిందని.. తాను అన్నీ అంగీకరిస్తాను కానీ.. డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు తీసుకునే భార్య వద్దని చెప్పాడు. అది విని అతని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారు పెళ్లికూతురు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంటనే రావాలని సమస్య ఉందని చెప్పారు.
దీంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ లోపే ఆ పెళ్లికూతురు ఇంట్లో తన భర్తతో గొడవపడింది. తనకు వెంటనే గంజాయి కావాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇదంతా చూసి ఆ పెళ్లికొడుకు తాము మోసపోయామని గ్రహించి.. తన తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసులకు తమకు జరిగిన మోసం గురించి చెప్పాడు. ఒక గంజాయి తాగే వ్యసనం ఉన్న యువతిని తనకు మోసపూరితంగా పెళ్లి చేశారని.. ఆమెను తన భార్యగా స్వీకరించలేనని అన్నాడు. పోలీసులు అంతా విని ఫిర్యాదు నమోదు చేయకుండా.. వధువు, వరుడు ఇరు పక్షాలను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేశారు. అయితే ఆ సమయంలో మరో ఆరోపణ వచ్చింది. అసలు ఆ పెళ్లి కూతరు మహిళనే కాదు.. ఒక ట్రాన్స్ జెండర్ అనే తీవ్ర ఆరోపణ పెళ్లికొడుకు చేశాడు.
దీంతో గొడవ మళ్లీ పెరిగింది. చివరికి పోలీసులు ఈ వ్యవహారాన్ని ఇంటి వద్దనే తేల్చుకోవడానికి ఇరు పక్షాలకు వారం రోజుల సమయం ఇచ్చి పంపారు. అయితే ఏం చేసినా.. ఆ గంజాయి వ్యసపరురాలిని తన భార్యగా స్వీకరించేది లేదని పెళ్లి కొడుకు మొండి కేస్తున్నాడు. ఫలితంగా పెళ్లికూతురు తండ్రి కోర్టులో కేసు వేస్తానని బెదిరించారు.