Tamilnadu Crime News: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. హాయిగా సంసారం సాగుతున్న సమయంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ప్రేమించుకున్న సమయంలో ఉన్న ప్రేమ కనుమరుగైంది. ఆ తర్వాత కోపాలు పెరిగాయి.. ఆపై హద్దు మీరాయి. చివరకు ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను గొంతు పిసికి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
అసలు ఏం జరిగింది?
కృష్ణగిరి జిల్లా హోసూర్‌లోకి జుజువాడిలో ఉంటున్నాడు భాస్కర్. ఆయన వృత్తి రీత్యా జిమ్ ట్రైనర్. నాలుగు షాపులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2018లో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది శశికళ. ఆమె సొంతూరు బెంగుళూరు. ఇద్దరి మనసులు కలిశాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఈ దంపతులకు ఆరూష్, శ్రీషా ఇద్దరు పిల్లలున్నారు. దంపతులు హోసూరులోని సీతారామ్ దిన్న, కామరాజ్‌నగర్, జూజువాడి, రాజేశ్వరి లేఔట్ ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నాలుగు షాపులు.. ఇద్దరు పిల్లలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. హ్యాపీగా సాగిపోతున్న భాస్కర్-శశికళ సంసారంలో చిన్నపాటి కలతలు మొదలయ్యాయి.
ఇదే సమయంలో జిమ్ మాస్టర్ భాస్కర్‌కు ప్రభుత్వ టీచర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా లవ్‌గా మారింది. ఈ సమయంలో భాస్కర్ ఇంట్లో కలతలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి ఎందుకు తన భర్త ఎలా వ్యవహరిస్తున్నాడు? సరిగా మాట్లాడటం లేదు. చీటికి మాటికీ సీరియస్ అవుతున్నాడు అనేది భార్య శశికళ ఆలస్యంగా తెలుసుకుంది. తన భర్త.. ఓ టీచర్‌తో ప్రేమలో పడ్డాడని విషయాన్ని పసిగట్టింది.
ALSO READ: బాలుడిపై యువతి లైంగిక దాడి, మళ్లీ మళ్లీ
లవ్ చేస్తున్న టీచర్‌ని అలసనత్తం ప్రాంతంలో ఉంచాడు. ఈ విషయం తెలుసుకొన్న భార్య శశికళ నిత్యం భర్తతో గొడవపడుతూ వచ్చేది. ఈ టార్చర్ తట్టుకోలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని చంపాని డిసైడ్ అయ్యాడు భాస్కర్. ఏప్రిల్ 30న రాత్రి భార్యతో ఏకాంతంగా ఉన్నాడు భాస్కర్. భార్య శశికళను చంపేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. దుస్తులతో గొంతు పిసికి హత్య చేశాడు.
భార్యది సహజ మరణంగా క్రియేట్ చేసే పనిలోపడ్డాడు భాస్కర్. భార్య మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెకు ముక్కులో రక్తం కారుతోందని వైద్యం చేయాలని తెలిపాడు. పరిశీలించిన డాక్టర్లు.. శశికళ చనిపోయిందని చెప్పేశారు. ఈ ఘటనపై హోసూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రిపోర్టులో ఏం తేలింది?
అనంతరం మృతదేహాన్ని భాస్కర్‌కి అప్పగించారు. రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. శశికళ మెడపై గాయం ఉందని తేలింది. దీంతో శశికళ పేరెంట్స్, బంధువులు కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 30న ఇంటికి భాస్కర్(Bhaskar)-శశికళ మద్యం తీసుకున్నారు. ఆ తర్వాత భాస్కర్, తన భార్య చేతులు, కాళ్లు మంచానికి కట్టేశాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో శశికళ మెడకు గుడ్డ బిగించి చంపేశాడు. వెంటనే భాస్కర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఓ మహిళతో పెట్టుకున్న రిలేషన్ చివరకు భాస్కర్‌ని జైలుకి పంపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేదు. చివవరకు జైలు పాలయ్యాడు.