Naa Anveshana Arrest: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదైంది. తెలంగాణ డిజిపి జితేందర్, మెట్రో MD ఎన్ వి ఎస్ రెడ్డి, శాంతికుమారి, దాన కిషోర్, వికాస్ రాజ్‌పై ఆరోపణ చేస్తూ వీడియో విడుదల చేశారు అన్వేష్. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ వీడియోలో ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ సైబరాబాద్ క్రైం పోలీసులు అన్వేష్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు.
కేసు వివరాలివే.. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్దమైన ప్రతిష్టను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా ఉంది. అధికారుల విశ్వసనీయతకు దెబ్బతీసేలా.. ప్రభుత్వంపై వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించే విధంగా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారన్ని ప్రజలకు వ్యాప్తి చెందేలా.. కంటెంట్ క్రియేట్ చేసిన అన్వేష్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక ప్రపంచ దేశాలన్ని చుట్టేస్తూ.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ.. అక్కడ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ.. మంచి పాపులారిటీతో పాటు.. డబ్బులు కూడా సంపాదించుకున్నాడు. అన్వేష్ నిర్వహిస్తోన్న యూట్యూట్ ఛానెల్స్ కు కూడా 2.38 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అంటే తన వీడియోలకు కూడా మిలియన్ల వ్యూస్ వస్తాయి. అలాగే లక్షల ఆదాయం కూడా వస్తుంది. అందులోనూ ఈ మధ్యన అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన.. సెలబ్రిటీల పేర్లను రివీల్ చేస్తూ వీడియోలు చేశాడు. దీంతో వీటికి ఇంకా భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అతని వీడియోలకు విశేష ఆదరణ లభించింది కూడా.
అయితే తాజాగా చేసిన ఈ ఆరోపణలతో మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అన్వేష్ చేసిన ఆరోపణలు నిజం అని నిరూపించకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చాలా మంది నెటిజన్లు బాధ్యాతారహితంగా వ్యవహరించిన అన్వేష్‌పై.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆయనే – బాబు మోహన్..!
ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యుద్దం చేస్తున్న యూట్యూబర్ అన్వేష్.. ఈ యాప్‌లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సెలబ్రెటీల చిట్టాలను బయట పెడుతూ వీడియోలను చేస్తున్నాడు. ఓ వైపు.. ఇలాంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు.. బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని వీడియోస్ చేస్తూ.. యువతకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అన్వేష్‌పై కేసు నమోదు కావడంతో.. అతడికి సపోర్ట్‌గా ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. కాగా సజ్జనార్‌తో కలిసి.. అన్వేష్ బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.