BigTV English

Haryana Crime News: దుప్పటి మూసి.. భర్త గొంతు కోసిన మహిళా యూట్యూబర్, ఆ తర్వాత కొత్త డ్రామా

Haryana Crime News: దుప్పటి మూసి.. భర్త గొంతు కోసిన మహిళా యూట్యూబర్, ఆ తర్వాత కొత్త డ్రామా

Haryana Crime News: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తు న్నాయి. ఒకప్పుడు భార్యను భర్త హత్య చేసిన ఘటన తరచూ వినేవాళ్లు. ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది. ఏకంగా ప్రియుడి మోజులోపడి భర్తను చంపేస్తున్న ఘటనలు సొసైటీలో క్రమంగా పెరుగుతున్నాయి. అలాంటి ఘటన ఒకటి హర్యానా చోటు చేసుకుంది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


హర్యానాలో దారుణం

హ‌ర్యానాలోని హిస్సార్ జిల్లాలో భివానీ ప్రాంతంలో ఈ  ఘటన జరిగింది. యూట్యూబర్‌ రవీనా-ప్రవీణ్‌‌లకు ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం భివానీ ప్రాంతంలో ఉంటున్నారు. ప్రవీణ్‌ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. భార్య రవీనా ఇంట్లో ఉండేది. కొన్నాళ్లు తర్వాత రవీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సురేశ్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసి చిన్నచిన్న వీడియోలు చిత్రీకరించేవారు.


వాటికి యూట్యూబ్‌లో మాంచి రెస్పాన్స్ వచ్చింది. హ‌ర్యానాలో వాళ్ల వీడియోలు బాగానే పాపుల‌ర్ అయ్యాయి. ఏడాదిన్న‌ర పాటు రవీనా, ఆమె ఫ్రెండ్ సురేష్ కలిసి కంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. కొత్త కొత్త కాన్సెప్టులు క్రియేట్ చేసి వీడియోలు షూట్ చేసేవారు. డబ్బులు కూడా వచ్చాయి. ఒకవిధంగా చెప్పాలంటే రవీనాకు మాంచి ఫేం వచ్చింది.

వ్యూస్ కోసం రకరకాల భంగిమల్లో

వ్యూస్ రప్పించుకునేందుకు కాస్త వెరైటీ భంగిమలో సురేష్‌తో కలిసి వీడియోలు చేసింది రవీనా.  తక్కువ సమయంలో బాగానే పాపులర్ అయ్యింది. అదే ఆమె కాపురంలో చిచ్చుపెట్టింది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన ప్రవీణ్, భార్యకు నచ్చజెప్పడం మొదలుపెట్టాడు. ఇకపై వీడియోలు చిత్రీకరణ వద్దని చెప్పాడు. ఏ మాత్రం వినలేదు.. భర్తపై రుసరుసలాడేది.

ALSO READ: దుబాయ్ లో దారుణం, ఇద్దరు తెలంగాణ వాసులను నరికిన పాకిస్తాని

ఈ క్రమంలో ఫ్రెండ్ సురేష్ కు మరింత దగ్గరైంది. ఆ తర్వాత రవీనా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేయడమేకాదు, మనీ సంపాదించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో రవీనా తన భర్త ప్రవీణ్‌తో గొడవ పడేది. సీన్ కట్ చేస్తే.. మార్చి 25న ర‌వీనా త‌న ఇన్‌స్టా ల‌వ‌ర్ సురేశ్‌తో ఓ అభ్యంత‌ర‌క‌రంగా క‌నిపించింది. దీంతో భార్యభర్తల మధ్య మ‌ళ్లీ గొడ‌వ రిపీట్ అయ్యాయి.

ఆవేశంలో ప్రియుడి కలిసి స్కెచ్

తనకు రోజూ ఇంటి పోరు తప్పలేదని భావించింది రవీనా. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని తన లవర్ సురేష్‌కి చెప్పింది. ర‌వీనా తన ఫ్రెండ్ సురేశ్ ఇద్ద‌రూ క‌లిసి ప్రవీణ్‌ను దారుణంగా హత్య చేశారు. దుప్పటి మూసి బలంగా కొట్టారు. ఆపై ప్రవీణ్ గొంతు కోసి చంపేశారు.

భర్త ప్రవీణ్ శరీరాన్ని బయటవాళ్లకు తెలియకుండా అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో నిందితులిద్దరు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి డెడ్‌బాడీని కాల్వలో పడేశారు. ప్రవీణ్‌ గురించి కుటుంబసభ్యులు రవీనాను  ప్రశ్నించేవారు. తనకు తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. రవీనా ఇంటికి కేవలం ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న డ్రైనేజీలో భర్త బాడీని పడేసింది.

ఎలా బయటపడింది?

హత్య జరిగిన మూడు రోజులకు అంటే సరిగ్గా మార్చి 28న డ్రైనేజీ దుర్వాసన రావడంతో పరిశీలించారు పోలీసులు. అందులో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. ఆ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. దీంతో రవీనా వ్యవహారం బయటకు వచ్చింది. ఆమెని విచారించడంతో నేరాన్ని అంగీకరించడమేకాదు.. ఎలా చేశామో వివరించింది. ఆమెకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రవీనా ఫ్రెండ్ సురేశ్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×