BigTV English

Dubai Murder Case: దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వాసులను నరికి చంపిన పాకిస్థాని

Dubai Murder Case: దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వాసులను నరికి చంపిన పాకిస్థాని

Dubai Murder Case: దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాసులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. మరో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు గాయపడ్డారు. మృతులు నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన సర్గం శ్రీనివాస్‌గా గుర్తించారు.


శ్రీనివాస్ తో పాటు, నిర్మల్, నిజామాబాద్‌కు చెందిన మరో ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. దమ్మన్నపేటకు చెందిన శ్రీనివాస్ తో పాటు, నిర్మల్ కు చెందిన ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ వాసి దేగాం సాగర్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

పాకిస్థానీ యులతో కలిసి.. మృతులు శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, క్షతగాత్రుడు శ్రీనివాస్ ఓ బేకరీలో పనిచేస్తున్నారు. శుక్రవారం సెలవు కావడంతో.. మాట్లాడుకునే సమయంలో గొడవ చెలరేగింది. ప్రత్యేక నినాదాలు చేస్తూ శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేసి, హతమార్చాడు. ఘటనపై కేంద్ర మంత్రులు జైశంకర్, కిషన్ రెడ్డి ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


దుబయ్‌లో తెలంగాణ వాసుల హత్య ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. విదేశాంగమంత్రి జైశంకర్‌ వెంటనే స్పందించారు. కేసును పర్యవేక్షించాల్సిందిగా, దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ను ఆదేశించారు. దాంతో బర్‌ దుబాయ్‌ పోలీస్ స్టేషన్‌ వెళ్లారు అధికారులు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరిని దారుణంగా హత్య చేసిన పాకిస్థానీయుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు దుబాయ్‌ పోలీసులు.

పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు హత్యకు గురయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పలు పత్రికలు, మీడియా ద్వారా తెలిసింది. ఈ విషయంలో మీరు చొరవతీసుకుని మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించగలరని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

దీనిపై.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే స్పందించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా.. దుబయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. ‘బుర్ దుబయ్ పోలీస్ స్టేషన్’ను సందర్శించి కేసు వివరాలను తెలుసుకున్నారు. 11 ఏప్రిల్, 2025 నాడు ఈ ఘటనకు సంబంధించి.. ఉద్దేశపూర్వక హత్యకేసుగా రిజిస్టర్ చేశామని ఇన్వెస్టిగేటింగ్ పోలీసులు.. భారత ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు.

Also Read: వివాహితతో అక్రమ సంబంధం.. ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన భర్త..

పొట్టకూటి కోసం దుబాయ్‌లో చనిపోవడంతో.. మృతుల గ్రామాల్లో విషాదం నెలకొంది. కుటుంబాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. మృతదేహాలను త్వరగా రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×