Air hostess Assaulted in Hospital | ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఒక ఎయిర్ హోస్టెస్ పై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారం చేశారు. ఈ షాకింగ్ ఘటన హర్యాణాలోని గురుగ్రామ్ లో మంగళవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. విమానంలో ప్రయాణికులకు సేవలందించే (ఎయిర్ హోస్టెస్) ఉద్యోగం చేసే ఒక 46 ఏళ్ల మహిళ ఇటీవల అంతర్జాతీయ ప్రయాణం కోసం విదేశాలకు వెళ్లగా అక్కడ ఒక హోటల్ లో బస చేయాల్సి వచ్చింది. ఆ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ఆమె కాసేపు సేద తీరిన తరువాత అందులోని కలుషిత నీరు కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె తన నివాసముండే హర్యాణా గురుగ్రామ్ లో సమీపంలోని ఓ మంచి హాస్పిటల్ లో ఏప్రిల్ 5న చికిత్స కోసం వెళ్లగా డాక్టర్లు ఆమెకు పరీక్షలు చేసి కలుషిత నీరు వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉందని.. వెంటనే అడ్మిట్ కావాలని చెప్పారు.
మరుసటి రోజు ఆమెకు శ్వాస తీసుకోవడం సమస్యగా ఉండడంతో వెంటిలేటర్ పై పెట్టారు. అయితే అప్పుడే ఆమెపై దాడి జరిగింది. ఐసియులో ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆస్పత్రి సిబ్బందిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ షాకింగ్ ఘటన గురించి ఆమె భయపడి ఎవరితోనూ చెప్పలేదు. కానీ గత ఆదివారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక.. ఇంటికి వచ్చి తన భర్తకు జరిగిన విషయం మొత్తం వివరించింది. ఆ తరువాత ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: భార్య హత్య కేసులో భర్తకు శిక్ష.. 20 ఏళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకొని మరో పెళ్లి..
ఈ ఘటన గురించి మీడియాకు తెలియడంతో సంచలనంగా మారింది. ఆస్పత్రిలోనూ మహిళలకు భద్రత లేదని స్థానికులు మండిపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న సదర్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. “ఆస్పత్రిలో ఎయిర్ హెస్టెస్ పై అత్యాచారం చేసిన గుర్తుతెలియని సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆస్పత్రిలోని సిసిటివి వీడియోల ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం. జిల్లా కోర్టు న్యాయమూర్తి ముందు బాధితురాలు సదరు ఎయిర్ హోస్టెస్ తన వాంగ్మూలం ఇచ్చింది. త్వరలోనే నిందితుడిని పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తాం” అని చెప్పారు.
ప్రైవేట్ పార్ట్ ని అసభ్యంగా తాకిన డాక్టర్
వారం రోజుల క్రితమే కర్టాటకలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కర్టాటక రాష్ట్రంలోని విజయపురా జిల్లా ఆస్పత్రిలో ఏప్రిల్ 9న ఓ గర్బవతి స్కానింగ్ కోసం వెళ్లింది. అక్కడ స్కానింగ్ చేసే.. డాక్టర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను అసభ్యంగా తాకాడు. పైగా ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. అయితే ఆమె వెంటనే బయటికి వచ్చిన తన భర్తతో ఈ విషయం చెప్పింది.
ఆ వెంటనే ఆ మహిళ భర్త తన స్నేహితులు, బంధువులను ఆస్పత్రికి తీసుకువచ్చి డాక్టర్ పై దాడి చేశారు. ఆ డాక్టర్ ఒక యువకుడు రేడియాలజీలో పిజీ చేశాడు. అయితే ఆ డాక్టర్ ని సెక్యూరిటీ సిబ్బంది కాపాడి తీసుకెళ్లారు. ఆ తరువాత ఆ డాక్టర్ మాట్లాడుతూ.. తాను తన డ్యూటీ చేశానని అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నారు.
ఈ విషయం తెలియడంతో స్థానికులు ఆస్పత్రి ఎదుట నిరసన చేశారు. మహిళను తాకకుండా స్కానింగ్ చేయడం కుదరదా అని కొందరు ప్రశ్నించారు. ఆ నిరసనల కారణంగా ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు వైద్య సేవలు నిలిచి పోయాయి. పోలీసులు డాక్టర్ పై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.