E-Paper
Advertisement

Ghatkesar: నాలుగేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే?

Ghatkesar: నాలుగేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే?
Advertisement

Ghatkesar: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి ప్రాంతంలో భారీగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న స్మగ్లర్‌ను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ (DTF) పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా బీమనపల్లి ప్రాంతానికి చెందిన ఉల్లంగి వెంకటరమణ (31)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గత కొంతకాలంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

నారపల్లి నందనవనం సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు, డీటీఎఫ్ సీఐ భరత్ భూషణ్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో వెంకటరమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి సుమారు 1.04 కిలోల హాష్ ఆయిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ విలువ మార్కెట్ లో సుమారు 5 లక్షలు ఉంటుందని అంచనా.

Advertisement

పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఒడిశాలోని పాడేరు ప్రాంతం నుండి హాష్ ఆయిల్‌ను తక్కువ ధరకు సేకరించి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా ఇతను 2021 నుండి పరారీలో ఉన్నట్లు తేలింది. గతంలో పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, టప్పాచాబుత్ర పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు.

అరెస్టయిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల కోసం, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement

Also Read: పోలీసులకే షాక్ ఇచ్చిన గంజాయి స్మగ్లర్ల ‘లేడీ గెటప్’ స్కెచ్.. చివరికి ఏమైందంటే?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×