E-Paper
Advertisement

TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?

TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?
Advertisement

TamilNadu News: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరోటా గొడవ ప్రాణ తీసింది. థెని జిల్లా దేవదానపట్టి ప్రాంతంలో సాధారణ రోజువారీ జీవితాన్ని గడుపుతున్న 28 ఏళ్ల యువకుడు చందనకుమార్ ఒక చిన్న వివాదం కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.

వివరాల ప్రకారం..  చందనకుమార్ కిరాణ షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇవాళ కిరాణం షాపు క్లోజ్ చేసి ఇంటికి దోశ తీసుకుని వెళ్లేందుకు సమీపంలోని హోటల్‌కు వెళ్లాడు. హోటల్ లో పరోటా మాస్టర్ శివుడు గట్టిగా శబ్దాలు చేసుకుంటూ పరోటా చేయడం స్టార్ట్ చేశాడు. చందనకుమార్‌కు కోపం వచ్చి అతడు శివుడిని సైలెంట్ గా పరోటా చేయమని హెచ్చరించాడు. ఇది కాస్త వాగ్వాదానికి దారి తీసింది. వాగ్వాదం పెద్ద గొడవగా మారింది.

Advertisement

ALSO READ: Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

వాగ్వాదం తీవ్రమై.. ఇద్దరూ ఒకరినొకరు దాడి చేసుకున్నారు. కోపంలో చందనకుమార్, శివుడి తలకు కర్రతో కొట్టి గాయపరిచాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివుడు ప్రతీకారంగా చందనకుమార్‌ ను కత్తితో కిరాతకంగా పొడిచాడు. రక్తపు మడుగుల్లో పడిపోయిన చందనకుమార్‌ను స్థానికులు త్వరగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వైద్యులు అతడిని మరణించినట్టు తెలిపారు. శివుడు కూడా తీవ్ర గాయాలతో పెరియకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: Group-D Job: గ్రూప్-డీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. ఇలా చదివితే ఉద్యోగం మీదే, ఇంకెందుకు ఆలస్యం

ఈ దారుణ ఘటన, ఒక పరోటా తయారీ సమయంలో జరిగిన చిన్న ఘర్షణ నుండి మొదలై, ఒక యువకుడి ప్రాణాలతో ముగిసింది. చందనకుమార్ భార్య గర్భవతి కావడం, ఈ మరణాన్ని మరింత విషాదకరంగా మార్చింది. దేవదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సమాజానికి హెచ్చరికను తెలియజేసింది. చిన్న వివాదాలు కూడా పెద్ద ఘర్షణకు దారితీయవచ్చు. కోపాన్ని నియంత్రించడం, సహనాన్ని పాటించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×