BigTV English

Hero Darshan enjoy: బెంగుళూరు సెంట్రల్ జైలులో హీరో దర్శన్‌ ఎంజాయ్, విచారణకు ఆదేశం

Hero Darshan enjoy: బెంగుళూరు సెంట్రల్ జైలులో హీరో దర్శన్‌ ఎంజాయ్, విచారణకు ఆదేశం

Hero Darshan enjoy: హత్య కేసులో అరెస్టయి బెంగళూరు సెంట్రల్ జైలులో కన్నడ హీరో దర్శన్‌కు రాచ మర్యాదలు లభిస్తున్నాయి. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.


కన్నడ నటుడు దర్శన్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. చిత్రదుర్గం ప్రాంతానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఆయన కీలక నిందితుడు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని పరప్పన ఆగ్రహారం సెంట్రల్‌లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఆ మధ్య జైలు ఆహారం సరిగా లేకపోవడంతో అనారోగ్యం బారినపడ్డాడు నటుడు దర్శన్. ఇంటి భోజనానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది.

సెంట్రల్ జైలులో బ్యారక్ నుంచి బయటకు వచ్చి ఫ్రెండ్స్‌తో కలిసి నటుడు దర్శన్ కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో దర్శన వ్యవహారంపై కర్ణాటక అంతటా చర్చ మొదలైంది. ఈ వ్యవహరం జైలు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.


ALSO READ: దెయ్యం వదిలిస్తానని కొట్టి చంపిన పాస్టర్

జైలులో నిందితుడు, నటుడు దర్శన్‌కు రాచ మర్యాదలు లభిస్తున్నాయనే అనుమానాలు తీవ్రమయ్యాయి. దర్శన్ మాంచి లుక్‌లో హెయిర్ కటింగ్ చేసుకుని, చేతికి వాచ్ పెట్టుకుని ఉన్నాడు. కారాగారంలో ఇవన్నీ సాధ్యమా అన్న ప్రశ్నలు లేకపోలేదు.

దర్శన్ జైలుకి వెళ్లిన తర్వాత చాలామంది ఆయనను కలిశారు. అందులో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి చెందినవారు ఉన్నారు. దర్శన్‌కు జైలులో రాచ మర్యాదలు, అందుకు సంబంధించిన ఫోటోలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్శన్ తోపాటు మిగతావారిని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

జైలులో ఉన్న ఓ రౌడీ షీటర్.. దర్శన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సెల్‌ఫోన్‌లో బంధించాడట. వాటిని తన భార్య ఫోన్‌కు పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ రౌడీషీటర్‌కు సెల్‌ఫోన్ ఎలా వచ్చిందన్నదే అసలు ప్రశ్న.

మొత్తానికి ఈ వ్యవహారంపై తీగలాగితే డొంక కదులుతోంది. దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఖైదీలు సంతోషంగా పార్టీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నది బీజేపీ నేతల మాట. తప్పు చేసినవారిలో మార్పు తీసుకురావాల్సిన అధికారులే ఖైదీలకు సహాయం చేస్తుంటే మార్పు సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×