BigTV English

Bigotry: దెయ్యం వదిలిస్తానని కొట్టి చంపిన పాస్టర్

Bigotry: దెయ్యం వదిలిస్తానని కొట్టి చంపిన పాస్టర్

Crime News: భక్తి ఉండాలి కానీ.. అది మూఢత్వంగా మారకూడదు. మౌఢ్యం ముదిరాక అది ఎన్ని అనార్థాలకైనా దారి తీయవచ్చు. మూఢత్వంతో కళ్లు మూసుకుపోయాక కొన్నిసార్లు విచిత్ర వేషాలు కూడా వేసే ముప్పు ఉంటుంది. అందులో కొన్ని ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. పంజాబ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.


పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల సామ్యూల్ మాసి మూర్ఛ వ్యాధితో బాధపడ్డాడు. పనికి వెళ్లినప్పుడు.. ఒక్కడే ఉన్నప్పుడు మూర్ఛ వస్తే ఎలా అనే విషయం ఆయన కుటుంబాన్ని బాధించింది. దీనికి పరిష్కారం కోసం ఆలోచించారు. సామ్యుల్ మాసికి మూర్ఛ తగ్గించాలని కుటుంబం పాస్టర్ జాకోబ్ మాసిని కోరింది. ఇంటికి వచ్చి ప్రార్థనలు చేయాలని బుధవారం విజ్ఞప్తి చేసింది.

సామ్యూల్ మాసి దేహంలో దెయ్యం ఉన్నదని పాస్టర్ జాకోబ్ చెప్పాడు. ఆ దెయ్యాన్ని బలవంతంగా వదిలించాల్సి ఉంటుందని వివరించాడు. ఇందుకోసం సామ్యూల్‌ను బాదాల్సి ఉంటుందని తెలిపాడు. ఆయనతోపాటు మరికొంత మంది అనుచరులను వెంట తెచ్చాడు. సామ్యూల్‌ను చితక్కొట్టాడు. ఈ దాడిలో సామ్యూల్ మరణించాడు. స్పాటల్‌లోనే మరణించినట్టు కుటుంబం తెలిపింది. మంచంపై సామ్యూల్ విగతజీవిగా కనిపించాడని వివరించింది.


Also Read: HYDRA: నెక్లెస్ రోడ్డు తొలగిస్తారా?: హైడ్రాపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

సామ్యూల్ కుటుంబం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆ పాస్టర్ పై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్యూటీ మెజిస్ట్రేట్ ఇందర్జిత్ కౌర్ సామ్యూల్ బాడీని పరిశీలించారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసులు జాకోబ్, బల్జిత్ సింగ్ సోను సహా ఇతరులపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. పీకల్లోతు విశ్వాసాల్లో మునిగి గుడ్డిగా తమకు తాము హానీ చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగాయి. ఒక ఘటనలో ఏకంగా దైవం వద్దకు వెళ్లుతామని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఇది అప్పట్లో సంచలనమైంది.

Tags

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×