Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. బాలికపై అత్యాచారం విషయంలో ఆయనపై పోక్సో కేసు నమోదు అయ్యింది. దాన్ని కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో రేపో మాపో ఆయనను విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.
వైసీపీ నేతలు వారంతట వారే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే ఎలా వుంటుందో ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలకు అర్థమవుతోంది. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వాన్ని ఇరికించబోయే అడ్డంగా బుక్కయ్యారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానం తలుపు తట్టినా ఫలితం లేకపోయింది.
దాదాపు నెల రోజుల కిందట ఉమ్మడి చిత్తూరు జిల్లా యర్రావారిపాలెంలో ఓ ఘటన జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఘటన జరిగిందా.. లేదా.. అనేది తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కూటమి సర్కార్‌పై బురద చల్లారు. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది.
చివరకు పోలీసులు రంగం ప్రవేశం చేసి అసలు విషయాలు బయటపెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చివరకు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. 14 ఏళ్ల బాలిక స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి మత్తు ఇచ్చారని బాలిక పేరెంట్స్‌ని నమ్మించింది.
ALSO READ: నడిరోడ్డుపై కత్తితో తోటి ఉద్యోగిని హత్య.. కారణం తెలిస్తే అంతా షాక్..
బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు అత్యాచారం జరగలేదని తేలిపోయింది. ఈ కేసులో బాధితురాలి మైనర్ బాలిక. తమపై అసత్య ప్రచారం చేసి మనోవేదనకు గురి చేశారని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు ఏ విధంగా అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.